హామీలను విస్మరించిన సీఎం కేసీఆర్‌: ప్రవీణ్‌రెడ్డి

ABN , First Publish Date - 2023-07-14T23:26:52+05:30 IST

కోహెడ, జూలై 14: రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్‌ విస్మరించారని హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి అన్నారు.

హామీలను విస్మరించిన సీఎం కేసీఆర్‌: ప్రవీణ్‌రెడ్డి
సీసీపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి

కోహెడ, జూలై 14: రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్‌ విస్మరించారని హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని చెంచల్‌ చెరువుపల్లి గ్రామంలో ‘పల్లెపల్లెకు ప్రవీణన్న-గడపగడపకు కాంగ్రెస్‌’ పేరిట ఆయన పర్యటించారు. ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే నెరవేర్చబోయే హామీలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్‌ జెండాను ఆవిష్కరించి పార్టీలో చేరిన పలువురు యువకులకు కండువా కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో 5 ఏళ్లలో 10 వేల ఇందిరమ్మ ఇళ్లు పేదలకు ఇచ్చానన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ ఒక్క డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కూడా ఇవ్వలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రె్‌సను అధికారంలోకి తీసుకువచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బస్వరాజు శంకర్‌, పార్టీ మండలాధ్యక్షుడు మంద ధర్మయ్య, సంపత్‌రావు, మాజీ ఎంసీటీసీ జయరాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-14T23:26:52+05:30 IST