చకచకా రైల్వేపనులు

ABN , First Publish Date - 2023-03-31T00:34:42+05:30 IST

కొండపాక మండలవాసుల ఎన్నో ఏళ్ల కల త్వరలోనే సాకారం కానున్నది. మనోహరాబాద్‌ నుంచి కొత్తపల్లి వరకు రైల్వేపనులు కొనసాగుతున్న విషయం విధితమే.

చకచకా రైల్వేపనులు
లకుడారం శివారులో నిర్మిస్తున్న రైల్వేస్టేషన్‌

లకుడారం, దుద్దెడ సమీపంలో రైల్వేస్టేషన్లు

చురుగ్గా సాగుతున్న నిర్మాణ పనులు

ఇప్పటికే ట్రయల్‌రన్‌ పూర్తి

త్వరలోనే నెరవేరనున్న కొండపాకవాసుల కల

కొండపాక, మార్చి 30: కొండపాక మండలవాసుల ఎన్నో ఏళ్ల కల త్వరలోనే సాకారం కానున్నది. మనోహరాబాద్‌ నుంచి కొత్తపల్లి వరకు రైల్వేపనులు కొనసాగుతున్న విషయం విధితమే. కుకునూరుపల్లి సమీపంలోని కొడకండ్ల వరకు పనులు పూర్తయి గూడ్స్‌ రైలు రాకపోకలు కొనసాగుతున్నాయి. కొడకండ్ల నుంచి దుద్దెడ వరకు సుమారు 30 కిలోమీటర్ల రైల్వేట్రాక్‌ పనులు పూర్తయ్యాయి. ఈ నెలలో రెండుసార్లు గూడ్స్‌ వ్యాగన్‌ ట్రైయిన్‌ ట్రయల్‌ రన్‌ కూడా పూర్తయింది. లకుడారం, దుద్దెడ సమీపంలో రెండు చోట్ల రైల్వేస్టేషన్లు ఏర్పాటు చేశారు. ఆయా స్టేషన్లలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ట్రయల్‌రన్‌ పూర్తవడం, త్వరలోనే రైల్వేసేవలు అందుబాటులోకి రానుండడంతో రైల్వేలైన్‌ కోసం భూములు ఇచ్చిన రైతులు, ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-03-31T00:34:42+05:30 IST