ఎంసీహెచ్‌ను సందర్శించిన ‘ముస్కాన్‌’ కేంద్ర బృందం

ABN , First Publish Date - 2023-05-02T23:48:47+05:30 IST

సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ముస్కాన్‌ బృందం పర్యటించింది.

ఎంసీహెచ్‌ను సందర్శించిన ‘ముస్కాన్‌’ కేంద్ర బృందం
సంగారెడ్డి ఎంసీహెచ్‌ను సందర్శిస్తున్న ముస్కాన్‌ బృందం

సంగారెడ్డి అర్బన్‌, మే 2: సంగారెడ్డిలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ముస్కాన్‌ బృందం పర్యటించింది. నేషనల్‌ ఎక్స్‌టర్నల్‌ అసె్‌సమెంట్‌లో భాగంగా ఇద్దరు కేంద్ర బృందం సభ్యులు డాక్టర్‌ రేణుబాల, డాక్టర్‌ ప్రభాకరన్‌ సందర్శించారు. తొలి రోజు పీడియాట్రిక్‌ వార్డు, ఎన్‌ఆర్‌సీ విభాగాలను పరిశీలించారు. ముఖ్యంగా రికార్డుల నిర్వహణ, సర్వీసెస్‌, పరికరాలు, పేషంట్‌ కేర్‌, రేడియాలజీ సర్వీసెస్‌, బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, టెస్టింగ్‌, ఫార్మసీ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అంతకుముందు ఆస్పత్రిలో చిన్నపిల్లలకు సంబంధించి అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రగతిని పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. కాగా బుధవారం కూడా బృందం పర్యటన కొనసాగనున్నది. ఎంసీహెచ్‌కు ముస్కాన్‌ అవార్డుకు వరిస్తే నగదు ప్రోత్సాహకం అందనున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జి.అనీల్‌కుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ మేనేజర్‌ రవి చింతల, ఆర్‌ఎంవోలు డాక్టర్‌ వీరాంజనేయులు, డాక్టర్‌ రవికుమార్‌, డాక్టర్‌ పద్మావతి, పీడియాట్రిక్‌ హెచ్‌వోడీలు, డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-02T23:48:47+05:30 IST