ముదిరాజ్‌ల సంక్షేమానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి
ABN , First Publish Date - 2023-03-18T23:38:56+05:30 IST
కోహెడ, మార్చి 18: ముదిరాజ్‌ల సంక్షేమానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. శనివారం మండలంలోని గుండారెడ్డిపల్లి గ్రామంలో పెద్దమ్మతల్లి పెద్దిరాజు కల్యాణానికి హాజరయ్యారు.

శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ప్రకాష్
కోహెడ, మార్చి 18: ముదిరాజ్‌ల సంక్షేమానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. శనివారం మండలంలోని గుండారెడ్డిపల్లి గ్రామంలో పెద్దమ్మతల్లి పెద్దిరాజు కల్యాణానికి హాజరయ్యారు. అలాగే దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనలో ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌తో కలిసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండ ప్రకాష్ మాట్లాడుతూ గత 60 ఏళ్ల ముదిరాజ్‌ల సంక్షేమం కోసం ఏ ప్రభుత్వాలు కృషి చేయలేదన్నారు. నేడు సీఎం కేసీఆర్ సారధ్యంలో ప్రతి నియోజకవర్గంలో ముదిరాజ్‌ల కోసం కమ్యూనిటీ భవనాలను కేటాయించారన్నారు. హైదరాబాద్‌లో ఐదెకరాల స్థలంలో రూ.5 కోట్లతో భవనాన్ని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్యామల, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీహరి, ఎంపీటీసీ కల్యాణి, మాజీ సర్పంచ్ కనకయ్య, పార్టీ మండలాధ్యక్షుడు మహేందర్, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.