సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో బోగి పండ్ల వేడుకలు
ABN , First Publish Date - 2023-01-04T22:39:38+05:30 IST
హుస్నాబాద్, జనవరి 4: హుస్నాబాద్ పట్టణంలోని సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో బుధవారం ముందస్తు సంక్రాంతి పండుగలో భాగంగా బోగి పండ్ల వేడుకలను నిర్వహించారు.
హుస్నాబాద్, జనవరి 4: హుస్నాబాద్ పట్టణంలోని సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో బుధవారం ముందస్తు సంక్రాంతి పండుగలో భాగంగా బోగి పండ్ల వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకుల రజిత హాజరై పండుగ విశిష్టతను వివరించారు. చిన్నారులపై బోగిపండ్లు పోసి దీవించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ అయిలేని అనిత, కౌన్సిలర్ కోమటి స్వర్ణలత, పాఠశాల కరస్పాండెంట్ రాధాసురేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.