రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

ABN , First Publish Date - 2023-04-06T23:41:58+05:30 IST

బీజేపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి గురువారం పార్టీ జెండా ఆవిష్కరించారు.

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
సిద్దిపేటలో నిర్వహించిన బీజేపీ ఆవిర్భావ కార్యక్రమంలో నాయకులు

పార్టీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి

సిద్దిపేట క్రైం, ఏప్రిల్‌ 6 : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ మెజార్టీ సీట్లు గెలుచుకొని అధికారం చేపట్టడం ఖాయమని పార్టీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద ఆయన గురువారం పార్టీ జెండా ఆవిష్కరించారు. ‘ఏక్‌ బార్‌ ఫిర్‌ సే మోడీ సర్కార్‌, తెలంగాణలో ఈసారి బీజేపీ సర్కార్‌’ అనే వాల్‌ పెయింటింగ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. దేశ సంక్షేమం,అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కేవలం బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని విమర్శించారు. ప్రశ్నించే వారి గొంతులను ప్రభుత్వం నొక్కాలని చూస్తున్నదని ఆరోపించారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టు అప్రజాస్వామికం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలనను ప్రజలను గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు పత్రి శ్రీనివాస్‌యాదవ్‌, అసెంబ్లీ కన్వీనర్‌ ఉపేందర్‌రావు, రోశయ్య, పురుమాండ్ల నర్సింహారెడ్డి, గాడిపల్లి అరుణరెడ్డి, యాదన్‌రావు, భోగి శ్రీనివా్‌స, కిషోర్‌

Updated Date - 2023-04-06T23:41:58+05:30 IST