ఘనంగా బీరప్ప కామరతి కల్యాణోత్సవం

ABN , First Publish Date - 2023-05-31T23:51:22+05:30 IST

కోహెడ, మే 31: మండలంలోని తంగళ్లపల్లిలో బీరప్ప కామరతి కల్యాణం బుధవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌, హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 ఘనంగా బీరప్ప కామరతి కల్యాణోత్సవం
తంగళ్లపల్లి బీరప్ప ఉత్సవాల్లో మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్‌గౌడ్‌

కోహెడ, మే 31: మండలంలోని తంగళ్లపల్లిలో బీరప్ప కామరతి కల్యాణం బుధవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌, హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కురుమ సంఘం ఆధ్వర్యంలో వారికి శాలువాలతో ఘనంగా సన్మానం చేసి బీరప్ప చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ ప్రతి కురుమ ఇంట్లో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో కళకళలాడుతూ పండుగ వాతావరణం ఉంటుందని అన్నారు. ఒగ్గు కళాకారులు, డోలు బృందాలు, శివసత్తుల నృత్యాల మధ్య ఎనిమిది రోజులు జరిగే బీరప్ప ఉత్సవం జాతరలా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కోనే శేఖర్‌, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు మంద ధర్మయ్య, ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, వరికోలు ఎంపీటీసీ బోయిని నిర్మల జయరాజ్‌, మాజీ సర్పంచులు, కురుమ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మండలంలోని శనిగరంలో కర్ర నర్సయ్య ఇటీవల మృతిచెందారు. మృతుని కుటుంబసభ్యులు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, రాజశేఖర్‌ను మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డిలు పరామర్శించారు.

Updated Date - 2023-05-31T23:51:22+05:30 IST