పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన
ABN , First Publish Date - 2023-05-27T00:34:45+05:30 IST
మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామ శివారులో గల నిర్మిస్తున్న సురభి లాబరేటరీస్ పరిశ్రమ నిర్మాణం పనులను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ పరిసర గ్రామాల ప్రజలు శుక్రవారం హత్నూర తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు.

హత్నూర, మే 26: మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామ శివారులో గల నిర్మిస్తున్న సురభి లాబరేటరీస్ పరిశ్రమ నిర్మాణం పనులను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ పరిసర గ్రామాల ప్రజలు శుక్రవారం హత్నూర తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ రసాయన పరిశ్రమ నిర్మాణం చేపడితే పచ్చని పంట పొలాలు విషతుల్యమయ్యే ప్రమాదం ఉందని సుమారు నెలరోజులుగా ఆందోళనలు చేపడుతున్నా.. అధికారులకు పట్టకపోవడం విచారకరమన్నారు. అంతేకాకుండా ఆ పరిశ్రమను ఆనుకొని తుర్కలఖానాపూర్ గ్రామ శివారు సర్వే నెంబరు 75/4లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని వెంటనే ఆ పనులను నిలిపివేసి పరిసర గ్రామాలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిఎడల ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేయనున్నట్లు వారు స్పష్టం చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ పద్మావతికి అందజేశారు. కార్యక్రమంలో వడ్డేపల్లి సర్పంచ్ స్వరూప, కోనంపేట్ సర్పంచ్ శివారెడ్డి, చింతల్‌చెర్వు ఎంపీటీసీ లక్ష్మి, మాజీ జడ్పీటీసీ శశికళ, సాదుల్లానగర్ మాజీ సర్పంచ్ లక్ష్మి, కృష్ణ, తుర్కలఖానాపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివా్‌సగౌడ్, నాయకులు పాల్గొన్నారు.