కార్యకర్తలే బీఆర్‌ఎ్‌సకు బలం: రంగారెడ్డి

ABN , First Publish Date - 2023-03-25T23:16:15+05:30 IST

జగదేవ్‌పూర్‌, మార్చి 25: బీఆర్‌ఎ్‌సకు బలం, బలగం కార్యకర్తలేనని, పార్టీని ప్రతి ఇంటికీ తీసుకుపోతామని బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివా్‌సగౌడ్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ రంగారెడ్డి అన్నారు.

కార్యకర్తలే బీఆర్‌ఎ్‌సకు బలం: రంగారెడ్డి
జగదేవ్‌పూర్‌లో మాట్లాడుతున్న రంగారెడ్డి

జగదేవ్‌పూర్‌, మార్చి 25: బీఆర్‌ఎ్‌సకు బలం, బలగం కార్యకర్తలేనని, పార్టీని ప్రతి ఇంటికీ తీసుకుపోతామని బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివా్‌సగౌడ్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ రంగారెడ్డి అన్నారు. పార్టీ ఆత్మీయ సమ్మేళనాలలో భాగంగా శనివారం జగదేవ్‌పూర్‌లో బీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేశారు. ముందుగా గ్రామాల బూత్‌స్థాయి కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ చేపట్టిన పథకాలను ప్రతి ఇంటికీ తీసుకుపోతామన్నారు. ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ చైర్మన్‌ శ్రీనివా్‌సరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు నరేష్‌, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్‌గౌడ్‌, ఎంపీటీసీ ఫోరం మండలాధ్యక్షురాలు కావ్యదుర్గయ్య, రైతుబంధు మండల కో ఆర్డినేటర్‌ సుధాకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌, రాజు పాల్గొన్నారు.

నేడు కోహెడలో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం

కోహెడ, మార్చి 25: కోహెడ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మండలాధ్యక్షుడు ఆవుల మహేందర్‌ తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌, కరీంనగర్‌, సిరిసిల్ల జిల్లా ఇన్‌చార్జి బస్వరాజు సారయ్య, కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు హాజరవుతున్నట్లు ఆయన చెప్పారు. మొదటి విడత సమ్మేళనానికి కోహెడ, ధర్మసాగర్‌పల్లి, శ్రీరాములపల్లి, నకిరేకొమ్ముల, పరివేద, విజయనగర్‌ కాలనీ, నారాయణపూర్‌, గోట్లమిట్ట, తీగలకుంటపల్లి, ఎర్రకుంటపల్లి, రాంచంద్రాపూర్‌, వింజపల్లి, కూరెళ్ల గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని కోరారు.

Updated Date - 2023-03-25T23:16:15+05:30 IST