దాబా సెంటర్‌ను కూల్చినవారిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2023-03-31T00:15:33+05:30 IST

సిద్దిపేట అర్బన్‌, మార్చి 30: సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నాల మధిర గాంధీనగర్‌ త్రీటౌన్‌సమీపంలో నిర్మిస్తున్న దాబా సెంటర్‌ను కొందరు వ్యక్తులు కక్షపూరితంగా అక్రమంగా కూల్చివేశారని యజమానులు తుపాకుల రమణాకాంత్‌, బైరి రాజు, బైరి గోపాల్‌ తెలిపారు.

దాబా సెంటర్‌ను కూల్చినవారిపై చర్యలు తీసుకోవాలి
పొన్నాల సమీపంలో కూల్చిన దాబాసెంటర్‌

సిద్దిపేట అర్బన్‌, మార్చి 30: సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నాల మధిర గాంధీనగర్‌ త్రీటౌన్‌సమీపంలో నిర్మిస్తున్న దాబా సెంటర్‌ను కొందరు వ్యక్తులు కక్షపూరితంగా అక్రమంగా కూల్చివేశారని యజమానులు తుపాకుల రమణాకాంత్‌, బైరి రాజు, బైరి గోపాల్‌ తెలిపారు. గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బైరి రాజు, బైరి గోపాల్‌కు చెందిన సర్వేనెంబరు 282 స్థలంలోని తుపాకుల రమణకాంత్‌తో కలిసి దాబా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకుని నిర్మాణం చేపట్టారు. సుమారు రూ.85 లక్షలు పెట్టి నిర్మాణం కూడా చేపట్టారు. ఇదే స్థలం గురించి కరీంనగర్‌కు చెందిన జానీ, అంజిరెడ్డి, కొండపాక మండలం జప్తి నాచారం గ్రామానికి చెందిన రామస్వామి అనే వ్యక్తులు బైరి రాజు, రమాకాంత్‌తో స్థలం విషయమై గొడవకు దిగారని, దీంతో కోర్టుకు వెళ్తే కేసు కోర్టులో నడుస్తుందని తెలిపారు. కోర్టులో కేసు నడుస్తుండగానే ఫిబ్రవరి 23న నిర్మించిన దాబా వెనుక కొంతభాగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని తెలిపారు. ఈ విషయమై సంబంధిత పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇదే అదునుగా మళ్లీ రెండు, మూడురోజుల క్రితం దాబాను ధ్వంసం చేశారని తెలిపారు. అప్పట్లో గొడవకు దిగిన ఆ ముగ్గురు వ్యక్తులే ధ్వంసం చేసి ఉంటారని బాధితులు ఆరోపిస్తున్నారు. సంబంధిత కేసును విచారించి బాధ్యులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు.

Updated Date - 2023-03-31T00:15:33+05:30 IST