మెదక్‌ డీఎంహెచ్‌వో కార్యాలయంలో రెండో రోజు ఏసీబీ తనిఖీలు

ABN , First Publish Date - 2023-09-22T23:16:29+05:30 IST

మెదక్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) సోదాలు ముగిశాయి.

మెదక్‌ డీఎంహెచ్‌వో కార్యాలయంలో రెండో రోజు ఏసీబీ తనిఖీలు

కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం

ఏసీబీ కోర్టుకు సీహెచ్‌వో ఫహీంపాషా తరలింపు

మెదక్‌ అర్బన్‌, సెప్టెంబరు 22: మెదక్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) సోదాలు ముగిశాయి. లంచం తీసుకుంటూ పట్టుబడిన కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌వో) ఫహీంపాషాను ఏబీసీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఫిజియోథెరపీ క్లినిక్‌ ఏర్పాటుకు అనుమతి కోసం రూ. 15వేలు లంచం తీసుకుంటూ సీహెచ్‌వో ఫహీంపాషా గురువారం సాయంత్రం ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన విషయం తెలిసిందే. ఫహీంపాషా జిల్లా వైద్యాధికారి చందునాయక్‌ పీఏగా పనిచేస్తుండడంతో ఈ కేసుకు సంబంధించి గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీహెచ్‌వో ఫహీంపాషాను అరెస్టు చేసి నాంపల్లి కోర్టుకు తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2023-09-22T23:16:29+05:30 IST