రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున సెల్‌టవర్‌ ఎక్కి యువకుడి నిరసన

ABN , First Publish Date - 2023-06-03T00:48:36+05:30 IST

తెలంగాణ రాష్ట్రం వచ్చి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పటికీ, రాష్ట్రాన్ని పాలించే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి పేదలకు అన్యాయం చేస్తుందని ఓ యువకుడు వినూత్న నిరసనకు దిగి రెండు గంట సేపు హల్‌చల్‌ చేశాడు.

 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున సెల్‌టవర్‌ ఎక్కి యువకుడి నిరసన
గుమ్మడిదలలో సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్న యువకుడు

మూడు ఎకరాల భూమి, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇవ్వాలని డిమాండ్‌

గుమ్మడిదల, జూన్‌ 3: తెలంగాణ రాష్ట్రం వచ్చి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నప్పటికీ, రాష్ట్రాన్ని పాలించే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి పేదలకు అన్యాయం చేస్తుందని ఓ యువకుడు వినూత్న నిరసనకు దిగి రెండు గంట సేపు హల్‌చల్‌ చేశాడు. వెంటనే మూడు ఎకరాల భూమి, డబల్‌ బెడ్‌ రూమ్‌ హామీలు నెరవేర్చాలని లేకుంటే సెల్‌ టవర్‌ మీద నుండి దూకి చచ్చిపోతానని నిరసనకు దిగాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. గుమ్మడిదల మండల కేంద్రానికి చెందిన అన్వర్‌ అనే యువకుడు ఉదయం బీఎ్‌సఎన్‌ఎల్‌ ఆఫీ్‌సలోని టవర్‌ పైకి ఎక్కి నిరసనకు దిగాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చి తొమ్మిదేళ్లు గడుస్తున్నా నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ అందని ద్రాక్ష గానే మిలిగాయని ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే పేదలకు డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, మూడెకరాల భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాడు. లేకపోతే టవర్‌ పైనుంచి దూకుతానని హెచ్చరించారు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎంపీపీ సద్ది ప్రవీణాభాస్కర్‌ రెడ్డి, జడ్పీటీసీ కుమార్‌గౌడ్‌, పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి యువకుడికి నచ్చజెప్పడంతో యువకుడు మెల్లగా కిందికి దిగాడు. దీంతో అక్కడివారు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ పాలన పట్ల ప్రజలలో ఏ విధంగా వ్యతిరేకత ఉందో ఆ యువకుని ఆవేదన చూస్తే అందరికీ అర్థమవుతుందని పలువురు చర్చించుకోవడం కనిపించింది.

Updated Date - 2023-06-03T00:48:36+05:30 IST