అదుపుతప్పిన ప్రైవేట్ స్కూల్ బస్సు
ABN , First Publish Date - 2023-04-04T00:32:59+05:30 IST
ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులకు సోమవారం పెనుప్రమాదం తప్పింది.
విద్యార్థులను పాఠశాల నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా ఘటన
ప్రమాద సమయంలో బస్సులో 55 మంది విద్యార్థులు
తప్పిన పెను ప్రమాదం
కోహెడ, ఏప్రిల్ 3 : ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులకు సోమవారం పెనుప్రమాదం తప్పింది. బెజ్జంకి మండ లంలోని రేగుళ్లపల్లె గ్రామంలో ఉన్న సెయింట్ విన్సెంట్ పల్లోటి స్కూలుకు చెందిన వాహనం కోహెడ శివారులో అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. వివరాల్లోకి వెళ్లితే.. శనిగరం, తంగళ్లపల్లి, కోహెడ, శ్రీరాములపల్లి గ్రామాలకు చెందిన 55 మంది విద్యార్థులను స్కూల్ బస్సులో పాఠశాల నుంచి మధ్యాహ్నం ఇంటికి తీసుకువస్తుంది. మార్గమధ్యలో కోహెడ శివారులో ఎదురుగా ప్రొక్లెయిన్‌తో పెద్ద లారీ వస్తుం డటంతో అతి వేగంగా వస్తున్న స్కూల్ బస్ అదుపుతప్పి రోడ్డు పక్కన పంట చేనులోకి దూసుకెళ్లింది. అయితే పక్కనే బావి ఉండగా దానిని ఆనుకని పెద్దచెట్టు ఉండడతో వాటి కొమ్మల వన బస్సు బావిలోకి వెళ్లకుండా నిలిచిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 55 మంది విద్యార్థులు ఉన్నారు. అటువైపుగా వెళ్తున్న వాహనాదారులు రాజు, సతీష్ బస్సు ఎమర్జెన్సీ డోర్ తలుపును తెరిచి వెంటనే విద్యార్థులను బస్సులో నుంచి సురక్షితంగా బయటకి తీసుకొచ్చారు. సామర్థ్యానికి మించి విద్యార్థులను బస్సులో తరలించడం, డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంతో నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. గతంలోనూ ఇదే డ్రైవర్ వల్ల ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలానికి ఇన్‌చార్జీ తహసీల్దార్ రాజిరెడ్డి, ఇన్‌చార్జి ఎంఈవో పావని చేరుకొని విచారించారు. పిల్లలను కాపాడిన యువకులను అధికారులు అభినందించారు. అజాగ్రత్తగా బస్సు నడుపుతున్న డైవ్రర్‌తో పాటు, పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎంఈవో పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.