దళిత మహిళల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మిల్లెట్‌ మ్యాన్‌

ABN , First Publish Date - 2023-03-31T00:28:38+05:30 IST

దళిత మహిళల అభ్యున్నతికి జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు మిల్లెట్‌మ్యాన్‌ పీవీ సతీష్‌ అని డీడీఎస్‌ బోర్డు సభ్యులు, ప్రముఖులు పేర్కొన్నారు.

దళిత మహిళల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మిల్లెట్‌ మ్యాన్‌

పీవీ సతీష్‌ కృషిని కొనియాడిన ప్రముఖులు

పస్తాపూర్‌లోని డీడీఎ్‌సలో సంస్మరణ సభ

జహీరాబాద్‌, మార్చి 30: దళిత మహిళల అభ్యున్నతికి జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు మిల్లెట్‌మ్యాన్‌ పీవీ సతీష్‌ అని డీడీఎస్‌ బోర్డు సభ్యులు, ప్రముఖులు పేర్కొన్నారు. గురువారం పస్తాపూర్‌లో గల డీడీఎ్‌సలో నిర్వహించిన పీవీ సతీష్‌ సంస్మరణ కార్యక్రమంలో ప్రముఖులు ప్రొఫెసర్‌, డీడీఎస్‌ బోర్డు సభ్యులు సంజయ్‌, ఆకుల విక్రం, డా. వినోద్‌ పావురాల, డా.రుక్మిణీరావు, జోగినాయుడు, ఆవీస్‌ కోటారి, డిల్లీ వసంత్‌ తదితరులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చిరుధాన్యాల కృషివలుడైన పీవీ సతీష్‌ డీడీఎస్‌ అభివృద్ధికి, నిరుపేదల శ్రేయస్సుకు చేసిన కృషిని కొనియాడారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చిరుధాన్యాలకు తగిన గుర్తింపును తెచ్చిన గొప్పమహానీయుడన్నారు. జహీరాబాద్‌ ప్రాంతంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించి, చిన్న, సన్నకారు రైతులను చిరుధాన్యాల సాగువైపు ప్రోత్సహించి ఆదుకున్నాడన్నారు. డీడీఎస్‌ ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించి అన్ని విధాలుగా ఆదుకున్నాడని వివరించారు. ఆయన తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే వారన్నారు. జహీరాబాద్‌ ప్రాంతంలో మహిళలకు రేడియో, వీడియో, జీవవైవిధ్యం, చిరుధాన్యాలసాగు, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించాడన్నారు. కార్యక్రమంలో డీడీఎస్‌ మహిళలు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T00:28:38+05:30 IST