Share News

420 కేసీఆర్‌కు ఓటు వేయొద్దు

ABN , First Publish Date - 2023-11-22T00:09:39+05:30 IST

పదేళ్లు రాష్ర్టాన్ని దోచుకుతిన్న 420 కేసీఆర్‌కు ఓటు వేయొద్దని కాంగ్రె్‌స నేత విజయశాంతి ప్రజలకు పిలుపునిచ్చారు.

420 కేసీఆర్‌కు ఓటు వేయొద్దు

ఆ కచరా దర్మార్గుడు

కేసీఆర్‌కు ఎందుకు ఓటు వేయాలి?

లక్షల కోట్లు దోచుకున్నందుకా

మోదీ, కేసీఆర్‌ మిలాఖత్‌

లిక్కర్‌ స్కాంలో దర్యాప్తు సంస్థలు కవితను ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదు?

మెదక్‌ రోడ్‌షోలో విజయశాంతి

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, నవంబరు 21: పదేళ్లు రాష్ర్టాన్ని దోచుకుతిన్న 420 కేసీఆర్‌కు ఓటు వేయొద్దని కాంగ్రె్‌స నేత విజయశాంతి ప్రజలకు పిలుపునిచ్చారు. మెదక్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌రావుకు మద్దతుగా మంగళవారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో ఆమె మాట్లాడారు. దుర్మార్గుడైన కేసీఆర్‌.. ఆయన కుటుంబం రూ.లక్షల కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటేయాలో చెప్పాలని ప్రశ్నించారు. అసైన్డ్‌ భూములను దోచుకున్నందుకా.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్షల కోట్లు మింగినందుకా.. బెల్ట్‌షాపులు పెట్టి మహిళల తాళిబొట్లు తెంచినందుకా.. అని ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తారని కేసీఆర్‌ను సీఎం చేస్తే ఫామ్‌హౌ్‌సలో తాగిపడుకున్నారని విమర్శించారు. ఒక్కరోజు కూడా ప్రజలను కలవని కేసీఆర్‌పై ప్రజలు తిరగబడాలని విజయశాంతి పిలుపునిచ్చారు. ప్రజలంతా సంకెళ్లు తెంచుకుని బయటకిరావాలని కోరారు. బీజేపీకి ఒకసారి అవకాశం ఇస్తే కేసీఆర్‌ను అరెస్ట్‌ చేస్తామంటున్న ప్రధాని మోదీ ఇప్పుడు అధికారంలో ఉండి ఎందుకు అరెస్ట్‌ చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్‌ ఇద్దరూ ఒక్కటి కాబట్టే లిక్కర్‌స్కాంలో నిందితురాలిగా ఉన్న కవితను, రూ.లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్‌ను అరెస్ట్‌ చేయడం లేదని ఆరోపించారు. మోదీ, అమిత్‌షా, నడ్డాలు ఇక్కడికి ప్రచారానికి వచ్చిన సమయంలో లిక్కర్‌స్కాంలో కవితను జైలుకు పంపుతామని అంటారని, ఢిల్లీకి వెళ్లాక కేసీఆర్‌తో కలిసిపోతారని విమర్శించారు. ఈసారి కచరాను గద్దెదించాలని ప్రజలను కోరారు. కేసీఆర్‌కు ఓటేస్తే తెలంగాణ చస్తుందని, తెలంగాణ బతకాలంటే కేసీఆర్‌ ఓటు వేయవద్దని పేర్కొన్నారు. కాంగ్రె్‌సకు అధికారమిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని ఆమె చెప్పారు. ఈసారి కేసీఆర్‌ గలీజు ఫ్యామిలీకి, గలీజు ప్రభుత్వానికి మద్దతుగా ఓటేయ వద్దని కోరారు. మెదక్‌ నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటువేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్‌షోలో కర్ణాటక కార్మికశాఖ మంత్రి సంతో్‌షలాడ్‌, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మెదక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రోహిత్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-22T00:09:40+05:30 IST