Marri Rajasekhar Reddy: అడ్డు వస్తే సహించేది లేదు.. దేనికైనా రెడీ

ABN , First Publish Date - 2023-10-10T07:29:02+05:30 IST

మల్కాజిగిరి నియోజకవర్గంలో మా పనులకు అడ్డువచ్చినా, మా కార్యకర్తల జోలికి వచ్చినా సహించేది లేదని దేనికైనా ఎదుర్కోవడానికి

Marri Rajasekhar Reddy: అడ్డు వస్తే సహించేది లేదు.. దేనికైనా రెడీ

- బీఆర్‌ఎస్‌ మల్కాజిగిరి పార్లమెంట్‌ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌ రెడ్డి

మల్కాజిగిరి(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): మల్కాజిగిరి నియోజకవర్గంలో మా పనులకు అడ్డువచ్చినా, మా కార్యకర్తల జోలికి వచ్చినా సహించేది లేదని దేనికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని మల్కాజిగిరి నియోజకవర్గ పార్లమెంట్‌ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌ రెడ్డి(Marri Rajasekhar Reddy) మైనంపల్లిని పరోక్షంగా హెచ్చరించారు. మల్కాజిగిరి(Malkajigiri)లో ఓ బలమైన నేత పదేళ్లపాటు ప్రజల్లో ఉన్న వ్యక్తితో పోటీ అంటే నేను మొదట భయపడ్డాను. అయితే ప్రజల్లోకి ఎక్కడకి వెళ్ళినా నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన చేసిన అభివృద్ధి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని అన్నారు. సోమవారం మల్కాజిగిరి బృందావన్‌ గార్డెన్స్‌లో నందికంటి శ్రీధర్‌ బీఆర్‌ఎస్‏లో చేరడంతో ఆయనకు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజశేఖర్‌ రెడ్డి ప్రసంగించారు. మల్కాజిగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని అన్నారు. రాజకీయాల్లో తాను మాజీ చైర్మన్‌ జి.సూర్యనారాయణరెడ్డిని ఆదర్శంగా తీసుకుంటున్నానని అన్నారు.

పార్టీయే నన్ను వెళ్లగొట్టింది: నందికంటి

తాను కాంగ్రెస్‌ పార్టీని వీడతానని అనుకోలేదు.. ఇలాంటి పరిస్థితిని నేనూ ఏరోజు ఊహించలేదు.. నేను పార్టీని వదలలేదు.. పార్టీయే నన్ను దూరంచేసుకుంది అని డీసీసీ మాజీ అధ్యక్షుడు ప్రస్తుత బీఆర్‌ఎస్‌ నేత, ఎంబీసీ చైర్మన్‌ నందికంటి శ్రీధర్‌ అన్నారు. నేను పార్టీలో చేరుతున్నప్పుడే కేటీఆర్‌కు స్పష్టంగా హామీనిచ్చాను మల్కాజిగిరి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎవరిని నియమించినా వారి విజయం కోసం కృషి చేస్తానని, ఇప్పటికీ అదే మాట మీద ఉన్నా అని స్పష్టం చేశారు. కాంగ్రె్‌సలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్లు ఇచ్చే సంప్రదాయం లేదు. అందుకు విరుద్ధంగా పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం, నా టికెట్‌ను సైతం ఇతరులకు కట్టబెట్టినందుకే తాను పార్టీ వీడాల్సి వచ్చిందని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సునీతరాముయాదవ్‌, శాంతిశ్రీనివా్‌సరెడ్డి, మీనాఉపేందర్‌రెడ్డి లతో పాటు మాజీ కార్పొరేటర్‌ జగదీ్‌షగౌడ్‌ పాల్గొన్నారు.

bbbb.jpg

Updated Date - 2023-10-10T07:29:02+05:30 IST