వైఎస్ షర్మిల క్షమాపణ చెప్పాలి
ABN , First Publish Date - 2023-02-21T23:21:14+05:30 IST
రాజకీయ పార్టీ సమావేశంలో ట్రాన్స్‌జెండర్‌లపై అనుచితంగా మాట్లాడిన వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెంటనే ట్రాన్స్‌జెండర్‌లకు క్షమాపణ చెప్పాలని ట్రాన్స్‌జెండర్‌లు డిమాండ్ చేశారు.
- జడ్చర్లలో ట్రాన్స్‌జెండర్‌ల నిరసన
జడ్చర్ల, ఫిబ్రవరి 21 : రాజకీయ పార్టీ సమావేశంలో ట్రాన్స్‌జెండర్‌లపై అనుచితంగా మాట్లాడిన వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెంటనే ట్రాన్స్‌జెండర్‌లకు క్షమాపణ చెప్పాలని ట్రాన్స్‌జెండర్‌లు డిమాండ్ చేశారు. జడ్చర్ల మునిసిపాలిటీ అంబేడ్కర్ చౌరస్తా వద్ద ట్రాన్స్‌జెండర్‌లు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ట్రాన్స్‌జెండర్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదంటూ పేర్కొన్నారు. షర్మిల వెంటనే ట్రాన్స్‌జెండర్‌లకు క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆమె పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు.