గ్రామాభివృద్ధికి కృషి చేస్తా
ABN , First Publish Date - 2023-09-21T23:51:55+05:30 IST
గ్రామాభివృద్ధికి పార్టీలకతీతంగా నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

- ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మాగనూరు, సెప్టెంబరు 21 : గ్రామాభివృద్ధికి పార్టీలకతీతంగా నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని గురువులింగంపల్లి గ్రామంలో గురువారం నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి, మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీల బలోపేతానికి నూతన గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. గ్రామాభివృద్ధి కోసం సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గ్రామగ్రామాల మధ్య రహదారుల అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు వెంకటయ్య, సర్పంచు అంజనమ్మసాగర్, సింగిల్ విండో అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ తిప్పయ్య, బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ఎల్లారెడ్డి, ఎంపీడీవో శశికళ, ఎంపీవో జైపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, హనుమంతు, సర్పంచులు రాజు, నర్సింహులు, బీఆర్‌ఎస్ నాయకులు మారుతి, నర్సింహులు, అశోక్‌కుమార్, తాయప్ప పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
నర్వ, సెప్టెంబరు 21 : మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ కార్యాలయాన్ని గురువారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం లంకాల, రాంపూర్, యాంకి గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన 100 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. అంతకుముందు బీఆర్‌ఎస్ మండల నాయకుడు దండు అయ్యప్ప మనుమరాలు డోలారోహణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎంపీపీ జయరాములు శెట్టి, వైస్ ఎంపీపీ వీణావతి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మణ్, మండలాధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, కిరణ్‌ప్రకాష్‌రెడ్డి, దండు అయ్యప్ప, శంకర్, శ్రీకాంత్‌రెడ్డి, మండ్ల చిన్నయ్య పాల్గొన్నారు.