Share News

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ABN , Publish Date - Dec 23 , 2023 | 11:08 PM

అర్హులందరికీ సంక్షేమ పథకాలకు అందించే దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు
క్రిస్మస్‌ కానుకలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

- ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

- క్రిస్మస్‌ కానుకల పంపిణీ

ఊట్కూర్‌, డిసెంబరు 23 : అర్హులందరికీ సంక్షేమ పథకాలకు అందించే దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. క్రిస్మస్‌ పండుగ సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో క్రైస్తవులకు క్రిస్మస్‌ కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల వరకే పార్టీలు అని, ఎన్నికల అనంతరం రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామన్నారు. ప్రతీ పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రతీ ఇంటికి చేరేలా కృషి చేద్ధామన్నారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభు పుట్టిన రోజును అందరు సంతోషంగా జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్‌ ఎంపీపీ ఎల్లాగౌడ్‌, ఊట్కూర్‌ సర్పంచ్‌ సూర్యప్రకాష్‌రెడ్డి, డీటీ సురేష్‌, కోఅప్షన్‌ సభ్యుడు అబ్దుల్‌ రహెమాన్‌, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు యజ్ఞేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు గోవిందప్ప, కొల్లూర్‌ మాజీ సర్పంచ్‌ సంవృద్ధి, కాంగ్రెస్‌ నాయకులు శంకర్‌, లింగం, జలాల్‌, ఊట్కూర్‌, కొల్లూర్‌, పెద్దపొర్ల గ్రామాల క్రైస్తవులు, ఫాస్టర్లు పాల్గొన్నారు.

మక్తల్‌ : మక్తల్‌ పట్టణంలోని ఎల్లమ్మకుంటలోని చర్చిలో శనివారం ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, పేట జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ క్రిస్మస్‌ కానుకలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం క్రిస్మస్‌ కానుకలను ప్రతీ క్రైస్థవ కుటుంబానికి అందిస్తామన్నారు. ప్రజలంతా కలిసిమెలిసి సోదర భావంతో ఉంటూ పండుగలు జరుపుకోవాలన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 11:08 PM