ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం
ABN , Publish Date - Dec 17 , 2023 | 10:45 PM
ఉద్యోగ విరమణ పొందిన ప్రతీ ఉద్యోగికి ప్ర భుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ సకాలంలో అదించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.
- ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అచ్చంపేటటౌన్, డిసెంబరు 17: ఉద్యోగ విరమణ పొందిన ప్రతీ ఉద్యోగికి ప్ర భుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ సకాలంలో అదించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. విశాంత్ర ఉద్యోగుల దినోత్సవం సందర్భంగా ఆదివారం పట్టణంలో విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన సమావేశానికి పాల్గొని మాట్లాడారు. విశ్రాంత ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతామన్నారు. ప్రభుత్వ ఉద్యమంలో ఉన్నప్పుడు వారి సేవలను ప్రజల కొరకు అంకితం చేశారన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం వారి హక్కులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ఆయన పేర్కొ న్నారు. నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ ఉద్యోగికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ విధులను నిర్వర్తించుకోవాలని సూచించారు. విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.