రాబోవు ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి

ABN , First Publish Date - 2023-07-21T23:23:58+05:30 IST

రాబోవు ఎన్నిక ల నిర్వహణకు పోలీస్‌ అధికారులు సన్నద్ధం కావాలని ఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశించారు.

 రాబోవు ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ వెంకటేశ్వర్లు

- ఎస్పీ వెంకటేశ్వర్లు

నారాయణపేట, జూలై 21: రాబోవు ఎన్నిక ల నిర్వహణకు పోలీస్‌ అధికారులు సన్నద్ధం కావాలని ఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వ హించిన ఎస్పీ పీఎస్‌ల వారిగా పెండింగ్‌ కేసు లు, గ్రేవ్‌, నాన్‌ గ్రేవ్‌ కేసులపై ఆరా తీశారు. పెండింగ్‌ కేసులను తగ్గించేందుకు అధికారుల కు పలు సూచనలు చేసిన ఎస్పీ, చట్ట వ్యతి రేక కార్యకలాపాలకు పాల్పడే వారితో పాటు గతంలో ఎన్నికల సందర్భంగా నేరాలకు పాల్ప డిన వ్యక్తులను బైండోవర్‌ చేయాలని ఆదేశిం చారు. డబ్బు, మద్యం, గంజాయి రవాణతో పాటు బెల్ట్‌ షాప్‌లపై నజర్‌ వేయాలని, గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తుల సమాచా రం సేకరించి నిఘా పెట్టాలని సూచించారు. పీఎస్‌లకు వచ్చేవారికి పారదర్శకంగా సేవలు అందించాలని, ఫిర్యాదు దారులతో మర్యాదగా మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. రానున్న ఎన్నికల దృష్ట్యా గ్రామాలను సందర్శించి సమస్యాత్మక గ్రామాల్లోని ప్రజలతో మమేకం కావాలని, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల ని, సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు పీఎస్‌ల పరిధిలో నిరంతరం పెట్రోలింగ్‌ వాహనాలు సైరన్‌ వేసుకొని గస్తీ నిర్వహించాలని సూచిం చారు. ఆకస్మికంగా వాహనాల తనిఖీతో పాటు మూఢనమ్మకాలపై, ట్రాఫిక్‌ నిబంధనలు, బాల కార్మిక వ్యవస్థ తదితర అంశాలపై గ్రామాల్లోని ప్రజలకు పోలీస్‌, కళాబృందాలు, షీ టీమ్స్‌ వి స్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. స మావేశంలో అదనపుఎస్పీ నాగేంద్రుడు, డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు రవిబాబు, రాంలాల్‌, శ్రీకాంత్‌రెడ్డి, జనార్దన్‌, ఆర్‌ఐలు డేవిడ్‌, కృష్ణ య్య, సూపరింటెండెంట్‌ శంకర్‌, ఎస్‌ఐలు వ సంత, పర్వతాలు, హరిప్రసాద్‌, శ్రీనివాసులు, శీనయ్య, శ్రీనివాస్‌ రావు, రమేష్‌, నవీన్‌, సునీ త, ఐటీకోర్‌, ఎస్‌బీ, డీపీవో, డీసీఆర్బీ, క్లూస్‌ టీం సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-07-21T23:23:58+05:30 IST