నీళ్లుంటేనే అభివృద్ధి
ABN , First Publish Date - 2023-06-07T23:28:32+05:30 IST
నీళ్లుంటేనే అభివృద్ధి అని, జిల్లాను సస్యశ్యామలం చేసేందుకే పెండింగ్‌లో ఉ న్న ప్రాజెక్టులతో పాటు నూతనంగా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టడం జరిగిందని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు.
- జిల్లాను సస్యశ్యామలం చేసేందుకే ప్రాజెక్టుల నిర్మాణం
- జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి
- జడ్చర్ల, చిన్నచింతకుంటలలో ఇరిగేషన్‌శాఖ ఆధ్వర్యంలో సాగునీటి దినోత్సవం
జడ్చర్ల, జూన్ 7 : నీళ్లుంటేనే అభివృద్ధి అని, జిల్లాను సస్యశ్యామలం చేసేందుకే పెండింగ్‌లో ఉ న్న ప్రాజెక్టులతో పాటు నూతనంగా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టడం జరిగిందని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం జడ్చర్లలోని చంద్రాగార్డెన్స్‌లో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో సాగునీటి దినోత్సవం కార్యక్రమా న్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో పెండిం గ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. పీఆర్‌ఎల్‌ఐ నిర్మాణం ఆలస్యం కావడానికి ప్రతిపక్ష పార్టీల నా యకులు వేసిన కేసులే కారణమని, వాటితో పాటు గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేయడమే కారణమని వివరించారు. ఉదండాపూర్ రిజర్వాయర్‌తో జడ్చర్ల నియోజకవర్గంలో అదనంగా ఒక లక్షా 50వేల ఎక రాలకు సాగునీరు అందనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ప్రచు రించిన ‘మా తెలంగాణం కోటి ఎకరాల మాగాణం’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసులు, ఈఈలు ఉదయ్‌శంకర్, రమేశ్, కృష్ణమోహన్, తెలంగాణ రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాది మి శివకుమార్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ వైస్‌చైర్మన్ కోడ్గల్‌యాదయ్య, జడ్చర్ల మునిసి పల్ చైర్‌పర్సన్ దోరేపల్లి లక్ష్మీ, బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్దన్‌రెడ్డి, బాదేపల్లి పీఏసీఎస్ చైర్మన్ సుదర్శన్‌గౌడ్‌తో పాటు, ఇరిగేషన్ శాఖ డీ ఈఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
జూరాలకు కోయిల్‌సాగర్ జలాలు
- దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
చిన్నచింతకుంట : పాలమూరు, రంగారెడ్డి ప్రా జెక్టు పూర్తయితే కోయిల్‌సాగర్ నుంచి జూరాలకు నీటిని అందిస్తామని, దిగువన గల ఊకచెట్టు వా గును కూడా భవిష్యత్‌లో ఒక జీవనదిలా మార్చేందుకు అవకాశం ఉంటుందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాల్లో భాగంగా బుధవారం చిన్నచింతకుంట మండల కేంద్రంలోని ఎంఎస్ గార్డెన్‌లో ఇరిగేషన్ అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆల ప్రత్యేక సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎ మ్మెల్యే మాట్లాడుతూ కురుమూర్తి ఆలయం నుంచి చిన్నచింతకుంట వరకు ఊకచెట్టు వాగుపై హైలె వల్ వంతెన, చెక్‌డ్యాం, గుట్టమీదకు ఘాట్‌రోడ్డు, ఆలయం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు శర వేగంగా జరుగుతున్నాయని, త్వరలో ప్రజల చిర కాల కోరిక నెరవేరనుందని తెలిపారు. కార్యక్రమం లో ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు వట్టెం రాజేశ్వరి, సర్పంచ్ మోహన్‌గౌడు, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యుడు కరుణా కర్‌రెడ్డి, ఇరిగేషన్ ఈఈ ప్రతాప్‌సింగ్, డీఈఈ గోపాల్‌చారి, డీఈఈ చందు, ఏఈ కిషన్, ఏఈఈ నరేందర్‌రెడ్డితో పాటు, నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన ఇరిగేషన్ అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.