గ్రామాభివృద్ధికి పెద్దపీట

ABN , First Publish Date - 2023-05-31T23:12:14+05:30 IST

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

గ్రామాభివృద్ధికి పెద్దపీట
మాధారంలో గ్రామ పంచాయతీ, మహిళా సమాఖ్య భవనాలకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే

- ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి

- పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మరికల్‌, మే 31 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని మా ద్వార్‌ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమాఖ్య భవనంతో పాటు పూసల్‌ పహాడ్‌ గ్రామంలో అంగన్‌వాడీ భవనం, రాకొండ గ్రామంలో మహిళా సమాఖ్య భవనానికి, ప్రాథమిక సబ్‌ సెంటర్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు 60 ఏళ్ల నుంచి చేయ లేని ఎన్నో అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో తొమ్మిదేళ్లలో చేపట్టినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. అంత కుముందు మండల కేంద్రంలో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన ఎస్‌వోసీలను బాధితులకు అందజేశారు. రవీందర్‌రెడ్డికి రూ.2.56 లక్షలు, వెంక టేశ్వర్‌రెడ్డికి రూ.30 వేలు, వెంకటయ్యకు రూ.35 వేలు, లక్ష్మమ్మకు రూ.36 వేల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం హాజ్‌ యాత్రకు వెళ్తు న్న మందిపల్లి మహాబూబ్‌ అలీ, హాసన్‌ సాబ్‌ను ఎమ్మెల్మే శాలువా, పూలమాలతో సన్మానించారు. ఎంపీపీ శ్రీకళరెడ్డి, వైస్‌ ఎంపీపీ రవికుమార్‌, కోఆప్షన్‌ మతిన్‌, ఎంపీటీసీ సభ్యుడు గోపాల్‌, సుజాత శ్రీనివాసులు, సర్పంచ్‌ గోవర్ధన్‌, నాయకులు రాజవర్దన్‌రెడ్డి, తిరుపతయ్య, కృష్ణయ్య, సంపత్‌, నర్సింహులు పాల్గొన్నారు.

అన్ని గ్రామాలకు రహదారుల సౌకర్యం

ధన్వాడ : అన్ని గ్రామాలకు రహదారుల సౌకర్యం కల్పిస్తానని, ఇందుకోసం నిధులు మంజూరు చేయిస్తున్నానని ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మందిపల్లి గేట్‌ నుంచి మణిపూర్‌ వరకు రూ.15 లక్షల వ్యయంతో చేపట్టే రోడ్డు నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. కార్య క్రమంలో మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డి, చీరాల కొండారెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌, బీఆర్‌ఎస్‌ యువజన విభాగం అ ధ్యక్షుడు సునిల్‌రెడ్డి, ఎంపీడీవో సద్గుణ, ఎంపీఈ వో సుదర్శన్‌, ఏఈ ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:12:14+05:30 IST