కేంద్రమంత్రి మహేంద్రనాథ్‌ పాండే

ABN , First Publish Date - 2023-06-26T22:53:32+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అవినీతి రహిత పాలన సాగుతోందని, కేంద్రం విడు దల చేసే ప్రతీ రూపాయి నేరుగా లబ్ధిదారులకు చేరు తుందని కేంద్ర భారీ పరి శ్రమల శాఖ మంత్రి డాక్టర్‌ మహేంద్రనాథ్‌ పాండే అన్నారు.

కేంద్రమంత్రి మహేంద్రనాథ్‌ పాండే
కోడూరులో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి మహేంద్రనాథ్‌ పాండే మోదీ హయాంలో అవినీతి రహిత పాలన

మహబూబ్‌నగర్‌, (ఆంధ్ర జ్యోతి)/ మహబూబ్‌నగర్‌ టౌన్‌/ మహబూబ్‌నగర్‌ రూరల్‌, జూన్‌ 26: ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో అవినీతి రహిత పాలన సాగుతోందని, కేంద్రం విడు దల చేసే ప్రతీ రూపాయి నేరుగా లబ్ధిదారులకు చేరు తుందని కేంద్ర భారీ పరి శ్రమల శాఖ మంత్రి డాక్టర్‌ మహేంద్రనాథ్‌ పాండే అన్నారు. బీజేపీ నిర్వహి స్తోన్న మహాజన సంపర్క అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. ఆదివారం రాత్రికే జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన సోమవారం ఉదయం నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత పట్టణ ప్రముఖులు సుబ్బయ్య తదితరుల ఇళ్లకు వెళ్లి, కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించారు. అనంతరం మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం కోడూరులో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తర్వాత పార్టీ జిల్లా కోశాధికారి శేరిపాండురంగారెడ్డి ఇంట్లో మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలో ప్రభుత్వ పథకాల నిధులు 30 శాతం కూడా లబ్ధిదారులకు చేరేవి కావన్నారు. దళారులు, పైరవీకారులకే లబ్ధి చేకూరేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక లబ్ధిదారులకు నేరుగా పథకాలను అందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్‌ పాలనలో కశ్మీర్‌లో నిత్యం ఘర్షణలు, కల్లోలాలు చెలరేగేవని, ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టాక.. చేపట్టిన కార్యాచరణతో నేడు కశ్మీర్‌ సుందర పర్యాటక ప్రాంతంగా వర్థిల్లుతోందన్నారు. సైన్యానికి వెన్నుదన్నుగా నిలిచామని, ఆధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చామని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు జరిగేవని, మన సైనికుల శవాలను పాకిస్థాన్‌ నుంచి పంపేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సైన్యం బలోపేతమవడంతో సైన్యంపై ఉగ్రదాడులు దాడి చేస్తే పాకిస్థాన్‌ సరిహద్దుల్లోకి వెళ్లైనా ఉగ్రమూ కలను మట్టుబెడుతున్నారన్నారు. కేంద్రంలో మోదీ సర్కార్‌ కొలువుదీరాక భారత్‌ విశ్వగురుగా ఎదిగిందని, రాబోయే రోజుల్లో నెంబర్‌వన్‌ స్థానానికి చేరబోతున్నామని మహేంద్రనాథ్‌ అన్నారు. సమావేశంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాకుల బాలరాజు, ఎన్‌పీ వెంకటేశ్‌, ఎగ్గని నరసింహులు, సీనియర్‌ నాయకుడు బురుజు రాజేందర్‌రెడ్డి, పి.శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణవర్ధన్‌రెడ్డి, కిష్ట్యానాయక్‌, పాండురంగారెడ్డి, జయశ్రీ పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T22:53:32+05:30 IST