మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డికి నివాళి

ABN , First Publish Date - 2023-06-13T23:06:18+05:30 IST

మక్తల్‌ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి మంగళవారం తెల్లవారుజామున మృతి చెందడంతో మరికల్‌ మండల కేంద్రంలోని ఇందిరా గాంఽధీ చౌరస్తాలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు అయన చిత్రపటానికి పూలమాల వేశారు.

మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డికి నివాళి
మరికల్‌లో దయాకర్‌రెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న టీడీపీ నాయకులు

మరికల్‌/ధన్వాడ/మక్తల్‌, జూన్‌ 13 : మక్తల్‌ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి మంగళవారం తెల్లవారుజామున మృతి చెందడంతో మరికల్‌ మండల కేంద్రంలోని ఇందిరా గాంఽధీ చౌరస్తాలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు అయన చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా రెండు నిమిసాలు మౌనం పాటించి, ఘనంగా నివాళి అర్పించారు. అదే విధంగా ధన్వాడ మండలంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు దయాకర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి ఆర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గర్తు చేసుకున్నా రు. సర్పంచ్‌ చిట్టెం అమరేందర్‌రెడ్డి, టీడీపీ మండ లాధ్యక్షుడు భాస్కర్‌, నాయకులు బాల్‌రెడ్డి, రఘువీ ర్‌, నర్సిములు నాయుడు ముదిరాజ్‌, కుర్వ చంద్ర ప్ప, కుర్వ నర్సిములు, జట్రం రాములుగౌడ్‌, సురేం దర్‌గౌడ్‌, బాల్‌ నర్సిములు, చంద్రయ్య పాల్గొన్నారు. అదే విధంగా గోటూర్‌, రాంకిష్టయ్యపల్లి సర్పంచులు నారాయణరెడ్డి, మాధవరెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డిలు సంతాపం వ్యక్తం చేశారు. మక్తల్‌లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, డీసీసీ జిల్లా అధ్యక్షుడు వాకిటి శ్రీహరి, కాంగ్రెస్‌ మాజీ అధికార ప్రతినిధి రాజుల ఆశిరెడ్డి, నాయకులు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, బీజేపీ నాయకులు కొండయ్య, జలంధర్‌రెడ్డి, పుర కమిషనర్‌ బాల్చెడ్‌ పావనీ, వైస్‌ చైర్‌పర్సన్‌ అఖిలతోపాటు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ సంతాపం వ్యక్తం చేశారు.

ప్రముఖుల సంతాపం

నారాయణపేట : మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ద యాకర్‌రెడ్డి మృతి పట్ల హర్యాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మంగళవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. దయాకర్‌రెడ్డి మృతి తీరని లోటు అన్నారు. అదే విధంగా బీజేపీ నాయకులు నాగూరావు నామాజీ, రతంగ్‌ పాండురెడ్డి, సత్యయాదవ్‌, వెంకట్రాములు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మూడు సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన దయాకర్‌రెడ్డి క్రమశిక్షణకు మారు పేరన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టి చెరగని ముద్రను వేసుకున్నారని ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. టీడీపీ నాయకులు వినయ్‌ మిత్ర, గోపాల్‌ యాదవ్‌, ఓంప్రకాష్‌ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన సేవలను కొనియాడారు. జీవో 69 అమలు చేయాలని పాదయాత్ర చేయడంతో పాటు రైతు బిడ్డగా వ్యవసాయంలో రాణించి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించారని బీకేఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వెంకోబా పేర్కొన్నారు.

Updated Date - 2023-06-13T23:06:18+05:30 IST