చిట్టెం నర్సిరెడ్డికి ఘన నివాళి

ABN , First Publish Date - 2023-08-15T23:40:21+05:30 IST

దివంగత మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, దివంగత నాయకుడు చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డికి ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎస్‌ రాజేందర్‌రెడ్డి ఘన నివాళి ఆర్పించారు.

చిట్టెం నర్సిరెడ్డికి ఘన నివాళి
సీఎన్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి ఆర్పిస్తున్న ఎమ్మెల్యేలు చిట్టెం, ఎస్‌ఆర్‌రెడ్డి

ధన్వాడ, కృష్ణ, ఆగస్టు 15 : దివంగత మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, దివంగత నాయకుడు చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డికి ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఎస్‌ రాజేందర్‌రెడ్డి ఘన నివాళి ఆర్పించారు. మంగళవారం ఎమ్మెల్యేలు ధన్వాడలోని సీఎన్‌ఆర్‌ ఘాట్‌ను సందర్శించి నివాళి అర్పించారు. అంతకుముందు రోడ్డు వద్ద ఉన్న నర్సిరెడ్డి విగ్రహానికి పూలమాల వేశారు. అదే విధంగా మాజీ మంత్రి డీకే అరుణ సీఎన్‌ఆర్‌ ఘాట్‌ను సందర్శించి పూలమాల వేసి నివాళి అర్పించారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంబం శివకుమార్‌రెడ్డి నర్సిరెడ్డి విగ్రహనికి పూలమాల వేశారు. ధన్వాడ, మక్తల్‌, నారయణపేట, మరికల్‌, ఊట్కూర్‌ మండలాల నుంచి బీఆర్‌ఎస్‌ నాయకుల పెద్ద ఎత్తున పాల్గొని నివాళి ఆర్పించారు. ఈ సందర్భంగా అన్నదానం చేశారు. సర్పంచ్‌ చిట్టెం అమరేందర్‌రెడ్డి, సునిల్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ గౌని శ్రీనివాసులు, సచిన్‌, శివారెడ్డి, కందూర్‌ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. కృష్ణ మండలం గుడెబల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని టై రోడ్డు వద్ద మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి వర్థంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. శ్రీనివాస్‌గుప్తా, జడ్పీటీసీ సభ్యురాలు అంజనమ్మ పాటిల్‌, ఎంపీపీ పూర్ణిమ, ఎంపీటీసీ సభ్యులు రాంచంద్ర, శారద, సర్పంచులు శివప్ప, రామకృష్ణ ధని, దేవేంద్రప్ప, పోలీస్‌ పాటిల్‌, నాయకులు విజప్పగౌడ, మోనేష్‌, శివరాజ్‌ పాటిల్‌, నాగప్ప పాల్గొన్నారు.

చిట్టెం త్యాగం వృథా కానివ్వం

నారాయణపేట : వెనుకబడిన నారాయణపేట, మక్తల్‌ అభివృద్ధి కోసం పాటు పడుతూ మావోయిస్టుల మారణ కాండకు బలైన మక్తల్‌ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకుడు చిట్టెం నర్సిరెడ్డి, వారి తనయుడు చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు అసువులు బాసిన కాంగ్రెస్‌ నాయకుల త్యాగాలను వృథా కానీవ్వమని మాజీ డీసీసీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి కుంబం శివకుమార్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వాకిటి శ్రీహారి పేర్కొన్నారు. చిట్టెం నర్సిరెడ్డి, చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి 18వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం నారాయణపేటలో వారి విగ్రహాలకు చిట్టెం కుటుంబీకులు చిట్టెం అభిజయ్‌రెడ్డి, పర్నీకారెడ్డిలతో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించారు. కాంగ్రెస్‌ నాయకులు సరాఫ్‌ వెంకట్రాములు, వెంకటపతి, నర్సింహులు, సుధాకర్‌, కె.హన్మంతు, సదాశివారెడ్డి, గౌస్‌, రఘుపతిరెడ్డి, సలీం, నరహరి, శరణప్ప, మహామూద్‌ ఖురేషి, మైనోద్దిన్‌, యూసూఫ్‌, తఖీ, శరణప్ప, రమేష్‌ పాల్గొన్నారు. అంతకుముందు నారాయణపేటలో చిట్టెం నర్సిరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు.

Updated Date - 2023-08-15T23:40:21+05:30 IST