నేడు మృగశిర కార్తె

ABN , First Publish Date - 2023-06-07T23:15:28+05:30 IST

వర్షా కాలానికి నాంది పలికే మృగశిర కార్తె గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్తెను గ్రామీణ ప్రాంత వాసులు మిరుగు కార్తెగా చెబుతారు. జూన్‌ మొదటి వారంలో వచ్చే ఈ కార్తె వ్యవసాయ పనులకు రైతులు శ్రీకారం చుడతారు. ఇన్నాళ్లు వేసవి తాపంతో ఇబ్బందులు పడ్డ జనం ఈ కార్తెలో కురిసే తొలకరి జల్లులతో ఉపశమనం పొందుతారు.

నేడు మృగశిర కార్తె

ప్రారంభం కానున్న వ్యవసాయ పనులు

మాంసం, మద్యంతో విందు

పెరిగిన నాటుకోళ్ల ధరలు

నారాయణపేట, జూన్‌ 7: వర్షా కాలానికి నాంది పలికే మృగశిర కార్తె గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్తెను గ్రామీణ ప్రాంత వాసులు మిరుగు కార్తెగా చెబుతారు. జూన్‌ మొదటి వారంలో వచ్చే ఈ కార్తె వ్యవసాయ పనులకు రైతులు శ్రీకారం చుడతారు. ఇన్నాళ్లు వేసవి తాపంతో ఇబ్బందులు పడ్డ జనం ఈ కార్తెలో కురిసే తొలకరి జల్లులతో ఉపశమనం పొందుతారు. ఈ కార్తె రోజు ప్రజలు ప్రత్యేక వంటకాలను చేసుకుని ఆరగిస్తారు. మాంసహారులు విధిగా చికెన్‌ వండుకుని తింటారు. ప్రత్యేకంగా నాటుకోళ్లను తినేందుకు మొగ్గు చూపుతారు. వేసవి కాలం ముగిసి, వర్షాకాలంలో వచ్చే చలిని తట్టుకునేందుకు విధిగా కోడి మాంసం తింటామని పలువురు చెబతారు. మాంసం తినడంతో పాటు సాయంత్రం మద్యం, కల్లును తాగుతారు. శాఖహారులు తీపి వంటకాలు తినడంతో పాటు.. బెల్లం, వేడిని పెంచే ఇంగువ గుళికలుగా చేసుకుని మింగుతారు.

నాటు కోడి ధర రూ.700

మృగశిర కార్తె చేసుకునే వారికి పెరిగిన కోళ్ల ధరలు భారంగా మారాయి. నాటు కోళ్లు ఒక్కోటి రూ.700 ధర పలుకు తున్నాయి. అంత ధర పెట్టినా కోళ్లు దొరకడం లేదని రైతులు అంటున్నారు. ఇక ఫారం కోళ్ల లైవ్‌ ధర కిలో రూ.130 ఉండగా, ఒక్కో కోడి రూ.260 నుంచి రూ.360 వరకు ధరలు ఉన్నాయి. చికెన్‌ కిలో రూ.240 ధర ఉండగా, స్కిన్‌లెస్‌ కిలో రూ.250 పలుకుతోంది. ఇటు కోళ్ల ధరలతో పాటు మద్యం ధరలు అధికంగా ఉండడంతో మృగశిర కార్తె గ్రామీణులకు ఆర్థిక భారం కానుంది.

Updated Date - 2023-06-07T23:15:28+05:30 IST