కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత
ABN , First Publish Date - 2023-12-02T22:58:54+05:30 IST
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఎన్నికల కౌం టింగ్ ప్రక్రియ ఆదివారం ప్రారంభం కానుంది. ఇక్కడ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పోలీస్‌శాఖ గట్టి బందోబస్తును ఏర్పాటుచేస్తుంది.
- ఉదయం 5 గంటల కల్లా కేంద్రానికి అధికారులు
- 144 సెక్షన్ అమలు..బాణసంచా కాల్చడం నిషేధం
- నేడు మద్యం దుకాణాలు బంద్
మహబూబ్‌నగర్, డిసెంబరు 2 : అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఎన్నికల కౌం టింగ్ ప్రక్రియ ఆదివారం ప్రారంభం కానుంది. ఇక్కడ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పోలీస్‌శాఖ గట్టి బందోబస్తును ఏర్పాటుచేస్తుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద రాష్ట్ర, కేంద్ర బలగాలతో మూడంచెల భద్రత ను ఏర్పాటుచేసింది. అనుమతి లేనిదే ఎవరినీ లోపలికి పంపింకూడదన్న ఆదేశాలిచ్చారు. ఉద యం 5-6 గంటల కల్లా అధికారులు కేంద్రానికి చేరుకోనున్నారు. ఆయా పార్టీల ఏ జెంట్లు కూడా అదే సమయానికి అక్కడికి చేరుకోనున్నారు. ముం దుగా వారి చేత ధ్రువీకరణ పత్రాలు తీసుకొని వారికి అనుమతులు జారీ చేయనున్నారు. అధికా రులకు ముందుగా కొద్దిగా అవగాహన కల్పించిన అనంతరం కౌంటింగ్‌ను ప్రారంభిస్తారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయను న్నారు. 350 మంది పోలీసులతో బందో బస్తు నిర్వహించనున్నారు. ఎన్నికలో హోరాహోరీగా ప్ర చారాలు చేయడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు, వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడం జరిగింది. ఫలి తాల తరువాత ఇరు వర్గాల మధ్య ఎలాంటి గొడ వలు జరగకుండా పోలీసులు అనుమానిత వ్యక్తు లపై నిఘా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 24 గంటల వరకు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నా ఫలితాల ఆధారంగా గెలిచే పార్టీల అభిమానులు, కార్యకర్తలు సందడి చేయ నున్నారు. ఆదివారం మద్యం దుకాణాలను మూసివేయనున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు దుకాణాలు మూసి ఉంటాయి.