బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాప్‌రెడ్డి
ABN , First Publish Date - 2023-05-28T23:20:16+05:30 IST
రాజకీయ, సాంఘిక చైతన్యానికి మారుపేరుగా నిలిచిన సురవరం ప్రతాప్ రెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని సాహితీవేత్త అంబ టి భానుప్రకాష్ కీర్తించారు.
- సాహితీవేత్త అంబటి భానుప్రకాష్
- పట్టణంలో ఘనంగా సురవరం జయంతి
గద్వాల టౌన్, మే 28 : రాజకీయ, సాంఘిక చైతన్యానికి మారుపేరుగా నిలిచిన సురవరం ప్రతాప్ రెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని సాహితీవేత్త అంబ టి భానుప్రకాష్ కీర్తించారు. సురవరం ప్రతాప్‌రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని రాజీవ్‌మార్గ్‌లో వెలసిన దివంగత నాయకుడి విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సంద ర్భంగా అంబటి భానుప్రకాష్ మాట్లాడుతూ తెలంగా ణలో కవులు లేరన్న నిందాపూర్వక వ్యాఖ్యలను సవాల్ గా స్వీకరించి 354మంది కవుల జీవిత విశేషాలతో సహా కూడిన ‘గోల్కొండ కవుల సంచిక’ గ్రంథాన్ని ప్రచురించడం ద్వారా విమర్శకులకు గ్రంథ రూపంలో స మాధానమిచ్చిన వైతాళికుడని ప్రస్తుతించారు. ప్రజల కడగండ్ల గురించి, స్థానిక చరిత్రల గురించి ఆయన పడిన తపన ప్రతి అక్షరంలోనూ నిలిచిందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సాహితీవేత్తలు అని మూని మహేందర్, డాక్టర్ మంగళగిరి శ్రీనివాసులు, సఫారి శంకర్‌లు ఉన్నారు.
- రెడ్డి సేవాసమితి ఆధ్వర్యంలో..
స్వాతంత్య్ర సమరయోధుడు, సాహితీవేత్త సురవరం ప్రతాప్‌రెడ్డి చిత్రపటానికి స్థానిక రెడ్డి సేవాసమితి కార్యాలయంలో బూరెడ్డిపల్లి సర్పంచ్ బండ్ల జ్యోతి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో నాయకులు మారుతి శ్రీనివాసరెడ్డి, నరేందర్ రెడ్డి, బహుదూర్ రెడ్డి , రామిరెడ్డి, పురుషో త్తం రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, బండ్ల వెంకటే శ్వర్ రెడ్డి, నరసింహా రెడ్డి, రాధా కృష్ణారెడ్డి, మల్లికార్జున రెడ్డి, తిరుపల్ రెడ్డి , సోంభూపాల్ రెడ్డి, పటేల్ నవీన్ రెడ్డి, మీన కేతన్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి ఉన్నారు. అంతకు పూర్వం సమావేశమైన రెడ్డి సేవాసమితి మహిళా విభాగం సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా రాధ, ఉపాధ్యక్షులుగా ప్రణీత, విజయలక్ష్మి, సుజాత, ఊర్మిళాదేవి, ప్రధాన కార్యదర్శిగా డి. శ్రీదేవి, సహాయ కార్యదర్శులుగా సుష్మ, దివ్య, వరలక్ష్మి, అరుణ, మంజుల, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కే. శ్రీదేవి, కోశాధికా రిగా డాక్టర్ పద్మ, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాజేశ్వరి, సాంస్కృతి కార్యదర్శిగా రాధికతో పాటు కార్యవర్గ సభ్యులుగా రజిత, లక్ష్మీదేవిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.