ఇళ్ల నిర్మాణాలు బాగున్నాయి
ABN , First Publish Date - 2023-02-21T23:11:26+05:30 IST
మహబూబ్‌నగర్ పట్టణ సమీపంలోని ఏనుగొండ మౌలాలిగుట్ట వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం బాగుందని కలెక్టర్ జి.రవినాయక్ అన్నారు.
- కలెక్టర్ జి.రవినాయక్
- మౌలాలిగుట్ట వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల తనిఖీ
మహబూబ్‌నగర్(కలెక్టరేట్), ఫిబ్రవరి 21 : మహబూబ్‌నగర్ పట్టణ సమీపంలోని ఏనుగొండ మౌలాలిగుట్ట వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం బాగుందని కలెక్టర్ జి.రవినాయక్ అన్నారు. మంగళవారం ఆయన మౌలాలిగుట్ట వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అకస్మి కంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ఇళ్ల నిర్మాణాల వివరాలను హౌసింగ్ ఈఈ డాక్టర్ వైద్యంభాస్కర్‌ను అడిగి తెలుసుకు న్నారు. మొదటి విడత 588 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు కాగా, వాటిలో 216 ఇళ్లు పూర్త య్యాయని, మరో 264 ఇళ్లకు ప్లాస్టరింగ్ పూర్తయిందని, మిగిలిన 89 ఇళ్లకు బ్రిక్‌వర్క్ పూర్త యిందని ఈఈ వైద్యంభాస్కర్ వివరించారు. రెం డో విడత చేపట్టిన 84 గృహాల్లో 64 గృహాల స్లాబ్ పూర్తికాగా, మరో 20 ఇళ్లు బ్రిక్ వర్క్ దశలో ఉన్నా యని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఒక్కో బ్లాక్‌లో ఎన్ని ఇళ్లు ఉన్నాయని ఆరా తీశారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాల పనులను వేగ వంతం చేయాలని. ఈ దిశగా తగు చర్యలు తీసు కోవాలని ఈఈ వైద్యంభాస్కర్‌ను కలెక్టర్ ఆదేశిం చారు. అలాగే, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను తక్షణమే అప్‌లోడ్ చేయాలని అర్బన్ తహసీల్దార్ పార్థసారథికి సూచించారు. అలాగే, ఇసుక దుర్వినియోగంపై దృష్టి పెట్టాలని అన్నారు. స్థానిక సంస్థలు, రెవెన్యూ అదనపు కలెక్టర్ కే.సీతా రామారావు, హౌసింగ్ ఏఈ విజయ్‌కుమార్, వర్క్ ఇన్‌స్పెక్టర్ రవి, ఆర్‌ఐ చైతన్య, సర్వేయర్ రాఘ వేంద్ర తదితరులున్నారు.