నిండుకుండను తలపిస్తున్న కోయిల్‌సాగర్ ప్రాజెక్టు
ABN , Publish Date - Dec 21 , 2023 | 11:06 PM
మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా నీటితో కళకళలాడుతున్నది.
- వచ్చే నెల ఆరు నుంచి నీటి విడుదల
దేవరకద్ర, డిసెంబరు 21: మహబూబ్‌నగర్ జిల్లాలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా నీటితో కళకళలాడుతున్నది. వానాకాలంలో కురిసిన వర్షాలతో పాటు జూరాల నుంచి నీటిని విడుదల చేయడంతో జలకళ సంతరించుకుని 32 అడుగులకు చేరింది. దీంతో అధికారులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ అందరు కలిసి ఆయకట్టు దారులకు నీటిని విడుదల చేయాలని సమావేశాలు ఏర్పాటు చేసి నిర్ణయించారు. దీంతో ప్రాజెక్టు అధికారులు నీటి విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఈఈ ప్రతాప్‌సింగ్ గురువారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. వచ్చేనెల 6వ తేదీ నుంచి ప్రాజెక్టు కింద రైతులు సాగు చేసుకున్న పంటలకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టు నుంచి రైతులకు నీటిని 10 రోజులకు ఒకసారి ఐదు విడతలుగా నీటిని విడుదల చేస్తామన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు.