ప్రజల ప్రాణాల రక్షణే ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2023-08-02T23:40:44+05:30 IST
ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు.
- అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం
- అంబులెన్స్‌ల ప్రారంభం
అలంపూర్ చౌరస్తా/ అలంపూర్/ మానవపాడు, ఆగస్టు 2 : ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ఆయన 102 అంబులెన్స్‌లను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అలంపూర్ చౌరస్తాలో వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆసుపత్రిలో గ్రామీణ ప్రాంత ప్రజలకే కాకుండా, హైవేపై రోడ్డు ప్రమాదాలు జరిగనప్పుడు త్వరితగతిన వైద్యం అందిం చేందుకు వీలుంటుందని చెప్పారు. కార్యక్రమంలో వడ్డేపల్లి జడ్పీటీసీ సభ్యుడు కాశపోగు రాజు, ఉండవల్లి వైస్ ఎంపీపీ దేవన్న, నాయకులు బైరాపురం రమణ, శ్రీనుగౌడు, ఎంపీటీసీ సభ్యుడు సుంకన్న పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధే లక్ష్యం
అలంపూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని అలంపూర్ ఎమ్మెల్యే వీఎం అబ్రహాం అన్నారు. పట్టణంలో మునిసిపల్ కార్యాలయ భవన నిర్మాణ పనులకు బుధవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. మునిసి పాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. సంక్షే మ పథకాల అమలులో మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ శేఖర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి
బీఆర్‌ఎస్ హయాంలోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరిగిందని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహాం అన్నారు. మానవపాడు మండలంలోని ఏ.బూడిద పాడు గ్రామంలో రూ.15 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, కమ్యూనిటీ హాల్, ఆలయ ప్రహరీ నిర్మాణ పనులకు బుధవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మునిసి పాలిటీల్లో పలు అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచు విరూపాక్షిరెడ్డి, నాయకులు మురళీధర్‌రెడ్డి, కాంతారెడ్డి, మహ్మద్, శంకర్‌గౌడ్ పాల్గొన్నారు.