గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2023-03-25T23:47:36+05:30 IST

గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఆబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న ప్రభుత్వం
అవారుల్డను అందిస్తున్న మంత్రి, ఎమ్మెల్యే ఆల

- ఉత్తమ సర్పంచ్‌లను అవార్డులు అందించిన

మంత్రి, ఎమ్మెల్యే ఆల

భూత్పూర్‌, మార్చి 25 : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఆబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ దీన్‌దయాళ్‌ ఉపా ధ్యాయ పంచాయతీ వికాస్‌ పురస్కారాల్లో భాగంగా జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాతీయలుగా ఎంపికైన మండంలోని కొత్తమొల్గర, శేరిపల్లి గ్రామాల సర్పంచులను మంత్రి, ఎమ్మెల్యే ఆల, కలెక్టర్‌ జీ. రవి నాయక్‌ అభినందిం చారు. ఈ సందర్భంగా ఉత్తమ గ్రామ పంచాయతీ సర్పంచులైన వెంకటమ్మ, బోల శేఖర్‌లకు వారు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు నర్సిములుగౌడ్‌, ఎంపీడీవో మున్నీ పాల్గొన్నారు.

కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆల

మండలంలోని గొప్పన్నపల్లిలో యాదవ సంఘం కమ్యూనిటీ భవనానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అదేవవిధంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన, ధ్వజస్తంభం, బొడ్రాయి ప్రతిష్ఠాప న కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రావులపల్లి గ్రామాల్లో రూ.20లక్షలతో పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అదే విధంగా జాతీయ రహదారి నుంచి గ్రామానికి వెళ్లే రహదారి వాగు వద్ద రూ.3.40కోట్లతో రోడ్‌ డ్యాం పనులకు శంకుస్థాపన చేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన 75మందికి కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, రైతుబంధు మండల అధ్యక్షుడు నర్సిములుగౌడ్‌, నాయకులు మేకల సత్యనా రాయణ, వార్డు కౌన్సిలర్‌ శ్రీనివాస్‌రెడ్డి, రామునాయక్‌, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటయ్య, బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు టీ. మురళీధర్‌గౌడ్‌, మాజీ సర్పంచ్‌ నారాయణగౌడ్‌, మాజీ ఎంపీటీసీ రమేష్‌చందర్‌, యువకులు ఆగిరి సత్యం పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:47:36+05:30 IST