ఎన్నికల నిర్వహణ కోసం మొదటి దశ తనిఖీలు చేపట్టాలి
ABN , First Publish Date - 2023-06-26T23:14:27+05:30 IST
అసెంబ్లీ ఎన్నిక లకు సమాయత్తమవుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహ ణకు మొదటి దశ తనిఖీలు చేపట్టాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ అన్నారు.
- అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్
నారాయణపేట టౌన్, జూన్ 26: అసెంబ్లీ ఎన్నిక లకు సమాయత్తమవుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహ ణకు మొదటి దశ తనిఖీలు చేపట్టాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిం చా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాను న్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో ఎఫ్‌ఎల్‌సీ ఎ న్నికల ఏర్పాట్లు, ఈసీఐ నిబంధనల ప్రకారం ఎఫ్ ఎల్‌సీ నిర్వహణ, గోడౌన్‌లోకి ప్రవేశించడం, ఈవీఎం బ్యాలెట్ యూనిట్, కంట్రోలింగ్ యూనిట్, వీవీ ప్యా ట్ యంత్రాల మొదటి దశ తనిఖీ ప్రక్రియ పూర్తి చే యాలన్నారు. మాక్ పోల్ నిర్వహణ, ఈవీఎంలను భద్రపరిచే గదిని, సమస్యలు తలెత్తిన వాటిని వేరు గా ఉంచడం, సీసీ కెమెరాల ద్వారా వెబ్ కాస్టింగ్, అలారం, భద్రత సిబ్బంది తదితర అంశాలను పరిశీ లించాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవో రాం చందర్, డీఎస్పీ సత్యనారాయణ, జగదీశ్వర్, నర్సింగ్‌రావు, డీటీలు పాల్గొన్నారు.
గ్రూప్ -4 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
వచ్చేనెల 1న శనివారం నిర్వహించనున్న గ్రూప్- 4 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి జూమ్ మీటింగ్‌లో తహసీల్దార్లతో ఆయన మాట్లాడారు. గ్రూప్- 4 పరీక్షలకు సంబంధించి అన్నీ ఏర్పాట్లు పూర్తి చేయాలని, కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని, కాపీయింగ్ జరగకుండా చూడాలని, తనిఖీలు చేసి అభ్యర్థులను కేంద్రాల్లో అనుమతించా లని, సెల్‌ఫోన్లు ఇతర పరికరాలు అనుమతించ రాదని అధికారులకు సూచించారు. సమావేశంలో కలెక్టరేట్ సూపరింటెండెంట్ జగదీశ్వర్, అధికారులు పాల్గొన్నారు.