ఎమ్మెల్యే ఆలకు కృతజ్ఞతలు

ABN , First Publish Date - 2023-05-26T00:00:08+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యాదర్శులను రెగ్యులరైజేషన్‌ చేస్తున్నట్లుగా ప్రక టించడం చాలా సంతోషకరమని జూనియర్‌ పంచా యతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేస్తూ గురువారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్యే ఆలకు కృతజ్ఞతలు
ఎమ్మెల్యే ఆలకు కృతజ్ఞతలు తెలుపుతున్న పంచాయతీ కార్యదర్శులు

- ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్న జేపీఎస్‌లు

భూత్పూర్‌, మే 25 : రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యాదర్శులను రెగ్యులరైజేషన్‌ చేస్తున్నట్లుగా ప్రక టించడం చాలా సంతోషకరమని జూనియర్‌ పంచా యతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేస్తూ గురువారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. దేవరకద్ర నియోజక వర్గంలోని వివిధ మండలాల నుంచి వచ్చిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు ఎమ్మెల్యే ఆలను కలిశారు. ఈ సంద ర్భంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయంగా ఉందని, పంచాయతీ కార్యదర్శుల కష్టాలను ప్రభుత్వం గుర్తించి ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయడానికి సన్నద్ధం అయినందుకు తాము ఎంతో సంతోష పడ్డామని పంచాయతీ కార్యదర్శులు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా సమ్మే చేసిన రోజులను పనిదినాలుగా గుర్తించాలని వారు ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T00:00:08+05:30 IST