ఆలూరు జాతరలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2023-01-07T23:41:41+05:30 IST
జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో ని ఆలూరు గ్రామ ఆంజనేయస్వామి జాతరలో శనివారం నిర్వహిం చిన ఎద్దుల బండలాగుడు పోటీల్లో ఉద్రిక్తత నెలకొంది.
- నిలిచిపోయిన ఎద్దుల బండలాగుడు పోటీలు
గట్టు, జనవరి 7 : జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో ని ఆలూరు గ్రామ ఆంజనేయస్వామి జాతరలో శనివారం నిర్వహిం చిన ఎద్దుల బండలాగుడు పోటీల్లో ఉద్రిక్తత నెలకొంది. జాతరలో ఈ సంవత్సరం ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించడానికి బీ జేపీ నాయకులు సన్నాహాలు చేశారు. పోటీలు ప్రారంభించడానికి మాజీ ఎమ్మెల్యే భరతసింహారెడ్డి హాజరయ్యారు. పోటీలను గ్రామం లో పది శాతం వదిలిన స్థలంలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. పోటీలు ప్రారంభించడానికి సమాయత్తమవుతున్న తరుణంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. గట్టు, ధరూరు ఎస్సైలు పవన్‌కుమార్, ఽశేఖర్‌రెడ్డి, పోలీసు సిబ్బంది గ్రామానికి చేరుకొని బండలాగు డు పోటీలను నిలుపుదల చేశారు. పోటీలు నిర్వహిస్తున్న స్థలం వివాదంలో ఉందని, శాంతిభద్రతల సమ స్య ఏర్పడుతుందని, పోటీలు నిర్వహించొద్దని నిర్వాహకులకు ఎస్సై పవన్‌కుమార్ సూచించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే భరతసింహారెడ్డి కలుగజేసుకోవడంతో కొద్దిసేపు పోలీసులకు, ఆయనకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఘాటుగా హెచ్చరించడంతో చేసేది లేక పోటీలను నిలుపుదల చేశారు. దీం తో సాయంత్రం వరకు ఎలాంటి గొడవలు జరుగుతాయోనన్న అందోళన గ్రామంలో నెలకొంది. పోలీసులు రాత్రి వరకు జాతరలో తిష్ట వేసి ఎలాంటి గొడవలు జరగకుండా బందోబస్తు నిర్వహించి, జాతర కార్యక్రమాలను పూర్తి చేయించారు. జాతర ప్రశాంతంగా ముగియడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.