తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదు

ABN , First Publish Date - 2023-01-25T23:31:30+05:30 IST

తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఒరగబెట్టింది ఏమీలేదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదు

-అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

భూత్పూర్‌, జనవరి 25 : తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఒరగబెట్టింది ఏమీలేదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలను జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. మునిసిపాలిటీ పరిధిలోని గోప్లాపూర్‌ పట్టణంలో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించా రు. తాటిపర్తిలో యాదవ కమ్యూనిటీ భవన నిర్మాణం, సీసీరోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం అదే గ్రామానికి చెందిన దళితబందు పథకం కింద ముగ్గురు లబ్ధిదారు లకు యూనిట్లను అందించారు. కొత్తూరులో సీసీ రోడ్డు నిర్మాణానికి, కర్వెన, లంబాడికుంట తండాలో గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి మునిసిపాలిటీ పరిధిలోని గోప్లాపూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు రూ.27,03,132లక్షల కల్యాణ లక్ష్మి చెక్కులను వారు అందించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌, జిల్లా మత్స్య సహకార సంఘం పర్సన్‌ ఇంచార్జీ మనేమోని సత్యనారాయణ, రైతుబంధు మండల అధ్యక్షు డు నర్సిములుగౌడ్‌, సింగిల్‌విండో అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్య క్షుడు ఆకుల వెకటయ్య, సీహెచ్‌వో రామయ్య, వైద్యులు హిమబిందు అబ్దుల్‌ రబ్‌, ముడా డైరెక్టర్లు సాయిలు, చంద్రశేఖర్‌గౌడ్‌, మాజీ సర్పంచ్‌ నారాయణగౌడ్‌,

Updated Date - 2023-01-25T23:31:30+05:30 IST