Share News

బీఎస్పీ అభ్యర్థులుగా స్వప్న, వర్కటం

ABN , First Publish Date - 2023-10-30T23:32:23+05:30 IST

బీఎస్పీ రెండో విడత అభ్యర్ధుల జాబి తాను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం ప్రకటించారు.

బీఎస్పీ అభ్యర్థులుగా స్వప్న, వర్కటం

- మరో నాలుగు నియోజకవర్గాలకు కూడా..

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : బీఎస్పీ రెండో విడత అభ్యర్ధుల జాబి తాను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం ప్రకటించారు. ఈ జాబితాలో మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ అభ్యర్థిగా బోయ స్వప్నశ్రీనివాస్‌, మక్తల్‌ అభ్యర్థిగా వర్కటం జగన్నాథ్‌రెడ్డి ఖరారయ్యారు. అదేవిధంగా దేవర కద్ర అభ్యర్థిగా బసిరెడ్డి సంతోష్‌రెడ్డి, అచ్చంపేటకు మోతుకూరి నాగార్జున, కల్వకుర్తికి కొమ్ము శ్రీనివాస్‌యాదవ్‌, కొల్లాపూర్‌కు గగనం శేఖ రయ్యను అభ్యర్ధులుగా ప్రకటించారు. మక్తల్‌ నుంచి బరిలో దిగుతున్న వర్కటం జగ న్నాథ్‌రెడ్డి ఇటీవలే బీఆర్‌ఎస్‌ని వీడి బీఎస్పీలోకి వచ్చారు. ఈయన 12 ఏళ్ల నుంచి మక్తల్‌ నియోజ కవర్గంలో రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మహబూబ్‌నగర్‌ నుంచి టిక్కెట్‌ దక్కించుకున్న బోయ స్వప్న శ్రీనివాస్‌ తొలిసారి అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు. ఈమె ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం మాచన్‌పల్లి ఎంపీటీసీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. మహబూబ్‌నగర్‌ తొలి ఎంపీపీ మండలం వెంకటయ్య కోడలుగా రాజకీ యాల్లోకి వచ్చిన ఈమె బీఎస్పీలో చేరి అసెంబ్లీ బరిలో దిగుతున్నారు.

అభ్యర్థుల ప్రకటనతో జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు బాణాసంచాలు పేల్చి సంబురాలు చేశారు.

Updated Date - 2023-10-30T23:32:23+05:30 IST