ఆదుకునేవారిని ఆదరించాలి

ABN , First Publish Date - 2023-09-26T23:19:16+05:30 IST

మండలంలో ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు.

ఆదుకునేవారిని ఆదరించాలి
వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- ఐదు గ్రామాల్లో రూ.6.01 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

హన్వాడ, సెప్టెంబరు 26 : మండలంలో ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. అయోధ్యనగర్‌, అత్యకుంట తండా, రామన్నపల్లి, వేపూర్‌, లింగన్నపల్లి గ్రామాలలో పర్యటించి 6.01 కోట్ల రుపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వేపూర్‌లో గ్రామస్థులు భారీ గజ మాలతో స్వాగతం పలికి సన్మానించారు. రామన్నపల్లిలో పూల వర్షం కురిపించారు. అయోధ్యనగర్‌లో మహిళా సంఘం భవనం రూ.12 లక్షలు, ఎస్టీ కమ్యూనిటీ భవనం రూ.7 లక్షలు, గుడి కాంపౌండ్‌ వాల్‌ రూ.2 లక్షల తో నిర్మించే పనులకు శంకుస్థాపన చేశారు. అత్యకుంట తండాలో రూ. 62 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, వాటర్‌ట్యాంక్‌లను ప్రారంభించా రు. రూ. 20లక్షలతో నిర్మించే గ్రామ పంచాయతీ భవనం పనులకు శంకుస్థాపన చేశారు. వేపూర్‌లో రూ.3.45 కోట్లతో నిర్మించే చెక్‌డ్యామ్‌కు భూమి పూజ చేశారు. అదే విధంగా బీటీ రోడ్డు, సీసీ రోడ్లు, మన ఊరు- మనబడిని ప్రారంభించారు. లింగన్నపల్లి, రామన్నపల్లి గ్రామాలలో సీసీ రోడ్లు, మహిళా సంఘం భవనాలను ప్రారంభించారు. ఆయా గ్రామాలలో మంత్రి మాట్లాడారు. ఆదుకునే వారిని ఆదరించాలన్నారు.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అంబటో నిపల్లి గ్రామస్థులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మంగళవారం మండలానికి వచ్చిన మంత్రిని గ్రామస్థులు గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయా నికి తీసుకెళ్లి ఆయన ముందు గ్రామస్థులు మద్దతు ప్రకటించారు. కార్యక్ర మంలో ఎంపీపీ బాలరాజు, జడ్పీటీసీ విజయనిర్మల, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు కొండ లక్ష్మయ్య, మండల అధ్యక్షుడు రాజుయాదవ్‌, పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్‌, ఎంపీడీవో ధనుంజయగౌడ్‌, తహసీ ల్దార్‌ కిష్య్టానాయక్‌, ముడా డైరెక్టర్‌ కొండ బాలయ్య, సర్పంచులు, సక్రిబా యి, గోవిందమ్మ, సత్యమ్మ, సుగుణ, వెంకటేష్‌, ఎంపీటీసీలు వడ్ల శేఖర్‌, వెంకట్రాములు, లక్ష్మీ, పార్టీ నాయకులు అధికారులు కృష్ణాయ్యగౌడ్‌, నరేం దర్‌, అన్వర్‌, రమణారెడ్డి, బసిరెడ్డి, రాఘవులు, మన్నన్‌, యాదయ్య, హరిచందర్‌ నాయక్‌ పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

మహబూబ్‌నగర్‌ రూరల్‌ : పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని, ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మంగళ వారం మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలంలోని అల్లీపూర్‌, బొక్కలోని పల్లి, ధర్మాపూర్‌, ఫత్తేపూర్‌, కోడూరు, వెంకటాపూర్‌, ఓబ్లాయిపల్లి, మాచ న్‌పల్లి తండా తదితర గ్రామాలలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులను ఆయన అందజేశారు. 21 మందికి రూ.22 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. గ్రంథాల య సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, ఎంపీపీ సుధాశ్రీ రాఘవేందర్‌గౌడ్‌, జడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్‌ సుందర్‌రాజు, ఎంపీడీ వో జ్యోతి, వైస్‌ఎంపీపీ అనితాపాండురంగారెడ్డి, ముడా డైరెక్టర్‌ ఆంజనే యులు, బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, నాయకులు పాల్గొన్నారు.

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

పాలమూరుయూనివర్సిటీ : యువత తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. పాలమూరు యూనివర్సిటీలో టీ-హబ్‌ ఆధ్వర్యంలో మంగళవారం జోగులాంబ గద్వాల్‌ ఇన్నోవెట్‌ తెలంగాణ అనే అంశంపై స్టార్టప్‌ల ఏర్పాటుకు అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీకాంత్‌రాథోడ్‌, ప్రిన్సిపాల్స్‌ చంద్రకిరణ్‌, సుజాత, అధికారులు అర్జున్‌కుమార్‌, భూమయ్య, రవికుమార్‌, టీ-హబ్‌ సభ్యులు సాయి అభినయ్‌, గజేంద్ర, రాజీవ్‌, శీతల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T23:19:16+05:30 IST