రుణాలపై సబ్సిడీ విడుదల చేయాలి
ABN , First Publish Date - 2023-02-21T23:24:15+05:30 IST
ఎస్సీ కార్పొరేషన్ రుణాలపై సబ్సిడీని విడుదల చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు మంగళవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు.
- కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు
- కలెక్టరేట్ ముందు ధర్నా
గద్వాల క్రైం, ఫిబ్రవరి 21 : ఎస్సీ కార్పొరేషన్ రుణాలపై సబ్సిడీని విడుదల చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు మంగళవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఎంపికైన 73 మందికి ఇప్పటివరకు ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేయలేదని తెలిపారు. రుణం వస్తుందనే ఆశతో కొందరు లబ్ధిదారులు అప్పు చేసి యూనిట్లు పెట్టారని తెలిపారు. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన రూ.1,30,000ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి మాట్లాడుతూ కార్పొరేషన్ అధికారులు తక్షణమై జిల్లా యాక్షన్ ప్లాన్‌ను విడుదల చేసి, నిదుర్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. పైరవీలకు తావు లేకుండా అర్హత ఉన్న ప్రతీ దళితుడికి దళిత బంధు పథకాన్ని వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏవో యాదగిరికి వినతిపత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మారెన్న, జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్, నాయకులు సవారన్న. అంజనేయులు, వెంకటస్వామి, కర్రెప్ప, మహేష్, ఉదయ్, బదరన్న, మునిసిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గట్టన్న పాల్గొన్నారు.