విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలి

ABN , First Publish Date - 2023-02-01T23:20:18+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నందున విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని ఎక్సైజ్‌, క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలి
క్లాస్‌ రూంలో విద్యార్థులను ప్రశ్నలు అడుగుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- ఉపాధ్యాయుడైన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

- వివిధ మండలాల్లో ప్రారంభమైన అధునాతన పాఠశాలలు

- అడ్డాకులలో ఎమ్మెల్యే ఆల, గండీడ్‌లో ఎమ్మెల్యే కొప్పుల

హన్వాడ, ఫిబ్రవరి 1 : ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నందున విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని ఎక్సైజ్‌, క్రీడల శాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మన ఊరు మన బడి పథకం కింద రూపుదిద్దుకున్న పాఠశాలలను మంత్రి ప్రారంభించారు. హన్వాడలో రూ.52.97 లక్షలతో నిర్మించిన మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలను మంత్రి ప్రారంభించారు. తరగతి గదిలోకి వెళ్లిన మంత్రి ఉపాధ్యాయుడుగా మారారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారినుంచి సమాధానాలు రాబట్టారు. బ్లాక్‌బోర్డ్‌పై జై తెలంగాణ, కేసీఆర్‌, కేటీఆర్‌ అని రాసి విద్యార్థులచే చదివించారు. చార్డ్‌పై రాసిన అక్షరాలను గుర్తించాలని ఒక్కో విద్యార్థిని అడిగి సమాధానాలు రాబట్టారు.

విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుపడి ఉంది : ఎమ్మెల్యే ఆల

అడ్డాకుల : విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పొన్నకల్‌ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో మన ఊరు...మనబడి పథకం కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక తరగతి గదులను ప్రారంభించారు. అనతరం విద్యార్థులకు భోజనశాల హాల్‌, వంట గది, డిజిటల్‌ క్లాస్‌ రూములను, ప్రహరీ, తాగునీరు వంటి వాటిని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యాభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల పిల్లలు నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నతమైన శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. అంతకు ముందు అదే గ్రామంలో మిషన్‌ భగీరథ సగర సంఘం భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌రెడ్డి, ఎంపీపీ నాగర్జున్‌రెడ్డి, తహసీల్దార్‌ కిషన్‌నాయక్‌, ఎంఈవో నాగన్న, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం : ఎమ్మెల్యే కొప్పుల

గండీడ్‌/ మహమ్మదాబాద్‌ : గ్రామీణ స్థాయి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల, ఉమ్మడి పరిధిలోని జక్లపల్లి, చిన్నాయపల్లి గ్రామాల్లో ‘మన ఊరు మన బడి’ పథకం కింద వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన పాఠశాలలను ఆయన ప్రారంభిం చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, సర్పం చులు కాంతమ్మ, చంద్రకళ, మధులత మండలాల తహసీల్దార్‌లు జ్యోతి, ఆంజనేయులు, విద్యాధికారి వెంకటయ్య ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T23:20:23+05:30 IST