కంపెనీని రద్దు చేసే వరకు పోరాటం

ABN , First Publish Date - 2023-03-05T23:03:57+05:30 IST

మండలంలోని చిత్తనూర్‌ గ్రామ శివారులో నిర్మిస్తున్న ఇథనాల్‌ జూరాల ఆగ్రో కంపెనీని ప్రభుత్వం వెంటనే రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని పలు గ్రామాల ప్రజలు పేర్కొన్నారు.

కంపెనీని రద్దు చేసే వరకు పోరాటం
ధర్నాలో పాల్గొన్న మహిళలు

- ఇథనాల్‌ కంపెనీ ఎదుట వంటవార్పు

మరికల్‌, మార్చి 5 : మండలంలోని చిత్తనూర్‌ గ్రామ శివారులో నిర్మిస్తున్న ఇథనాల్‌ జూరాల ఆగ్రో కంపెనీని ప్రభుత్వం వెంటనే రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని పలు గ్రామాల ప్రజలు పేర్కొన్నారు. ఆదివారం వివిధ గ్రామాల ప్రజలతో పాటు ఆయా సంఘాల నాయకులు కంపెనీ ఎదుట వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కంపెనీ రద్దు చేయాలని కంపెనీ చుట్టూ 20 కిలో మీటర్ల పరిఽఽధిలో ఉన్న 53 గ్రామాల్లో 11 రోజుల పాటు పాదయాత్ర కొనసాగిందన్నారు. ఇథనాల్‌ కంపెనీ ద్వారా వెలు వడే వ్యర్థ్యాల వల్ల వాతావరణ కాలుష్యం, భూ కాలుష్యం, నీటి కాలుష్యం ఏర్పడి వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అవుతోందన్నారు. అంతేకాక ప్రజలు రోగాల బారినపడే అవకాశాలు ఉన్నాయ న్నారు. నిరుపేద రైతులకు చెందిన ఒకటి, రెండు ఎకరాలు కూడా కంపెనీ కాలుష్యం వల్ల పంటలు పండక జీవనధారం కోల్పోయి, తీవ్ర ఇబ్బందులకు గురవుతురన్నారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు కూడా కంపెనీ రద్దు చేయాలని చేస్తున్న పోరాటాని కి మద్దతు ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో ఎక్లాస్‌పూర్‌ సర్పంచ్‌ భర్త చింతలయ్య, మురళీధర్‌ గుప్త, వంశీకృష్ణ, సూర్యనారాయణ, బండారు శ్రీనివాస్‌, మల్లేష్‌, హరీష్‌, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T23:03:57+05:30 IST