Share News

ఓట్ల లెక్కింపు సామగ్రికి పటిష్ట భద్రత

ABN , First Publish Date - 2023-12-05T23:48:36+05:30 IST

జిల్లాలోని రెండు శాసనసభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సామగ్రికి పటిష్ట భద్రత కల్పించినట్లు కలెక్టర్‌ వల్లూరు క్రాంతి తెలిపారు.

ఓట్ల లెక్కింపు సామగ్రికి పటిష్ట భద్రత
అధికారులు, సిబ్బందికి సూచనలు చేస్తున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

గద్వాల, డిసెంబరు 5 : జిల్లాలోని రెండు శాసనసభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సామగ్రికి పటిష్ట భద్రత కల్పించినట్లు కలెక్టర్‌ వల్లూరు క్రాంతి తెలిపారు. పట్టణ సమీపంలోని గోనుపాడు వద్దనున్న ఓట్ల లెక్కింపు కేంద్రం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో మంగళవారం జరిగిన సామగ్రి భద్రత పనులను కలెక్టర్‌ పరిశీలించారు. అలంపూర్‌, గద్వాల నియోజకవర్గాలకు సంబంధించిన స్టాట్యూటరీ, నాన్‌ స్టాట్యూటరీ, పీవో డైరీ, ఫారం -17సీ, మాక్‌ పోల్‌ స్లిప్స్‌, వీవీ ప్యాట్‌ స్లిప్పులు, ఈవీఎం, స్ర్కూటినీ, స్టాట్యూటరీ, నాన్‌ స్టాట్యూటరీ కవర్లు, టెండర్‌ బ్యాలెట్‌, ఈవీఎం బ్యాలెట్‌ పేపర్లు అన్నింటినీ ట్రంకు పెట్టెలో భద్రపరచి స్ర్టాంగ్‌ రూంలో ఉంచినట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వాటికి సీల్‌ వేసి స్ర్టాంగ్‌రూంలో భద్రపరచినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అపూర్వ చౌహాన్‌, చీర్ల శ్రీనివాసులు, ఆర్డీవో చంద్రకళ, ఎస్‌డీసీ సుబ్రహ్మణ్యం, తహసీల్దార్లు నరేందర్‌, సరితారాణి, సెక్షన్‌ సూపరింటెండెంట్‌ నరేష్‌ ఉన్నారు.

Updated Date - 2023-12-05T23:48:42+05:30 IST