Share News

దళితులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

ABN , Publish Date - Dec 14 , 2023 | 10:45 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం దళితులకు పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే స్పీకర్‌గా దళిత ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు.

దళితులకు రాష్ట్ర  ప్రభుత్వం పెద్దపీట
కేక్‌కట్‌ చేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

- జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

- స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ ఎంపికపై హర్షం

గద్వాల, డిసెంబరు 14 : కాంగ్రెస్‌ ప్రభుత్వం దళితులకు పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే స్పీకర్‌గా దళిత ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ ఎన్నిక కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ గురువారం జడ్పీ క్యాంపు కార్యాలయంలో కేక్‌కట్‌ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో దళిత, గిరిజనులకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే గిరిజనబిడ్డ సీతక్క మంత్రి, గడ్డం ప్రసాద్‌ స్పీకర్‌గా ఎన్నికయ్యారని వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను వందరోజుల్లో అమలు చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని, అందులో ఇప్పటికే రెండింటిని అమలు చేశారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మధుసూదన్‌బాబు, ఇసాక్‌, జమ్మిచేడు ఆనంద్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, ఎల్లప్ప, మహిమూద్‌, తిమ్మోతి, మాల శ్రీనివాసులు, శెట్టి ఆత్మకూర్‌ లక్ష్మన్‌, మాచర్ల లక్ష్మన్‌, కొత్త గణేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2023 | 10:46 PM