ఆదిశిలా క్షేత్రంలో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2023-01-17T23:30:20+05:30 IST

ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభువు లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయంలో జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత తిరుపతయ్య, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు.

ఆదిశిలా క్షేత్రంలో ప్రత్యేక పూజలు
లక్ష్మీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యే

- మల్దకల్‌లో కనకదాసు విగ్రహావిష్కరణ

మల్దకల్‌, జనవరి 17 : ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభువు లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయంలో జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత తిరుపతయ్య, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు వారికి ఆలయ చైర్మన్‌ ప్రహ్లాదరావు, అర్చకులు సాదరస్వాగతం పలికారు. అనంతరం మండల కేంద్రంలోని భక్తి మార్గంలో ఏర్పాటు చేసిన కనకదాసు విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదిశిలా క్షేత్రం ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోందన్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలోని అన్ని దైవక్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఆలయానికి వెళ్లే భక్తిమార్గంలో దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జంబురామన్‌గౌడ, ఎంపీపీ రాజారెడ్డి, వైస్‌ ఎంపీపీ వీరన్న, సర్పంచు యాకోబు, రైతుబంధు సమితి అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు వెంకటన్న, నాయకులు కృష్ణారెడ్డి, నరేందర్‌, మధు, రాముడు, కురుమన్న, పరశురాముడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-17T23:30:22+05:30 IST