వాసవీమాతకు 108 పదార్థాలతో ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2023-07-25T23:41:29+05:30 IST
మక్తల్ మునిసిపాలిటీలో అధిక శ్రావణ మాసం సందర్భంగా ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో వాసవీ మాత ఆలయంలో మంగళవారం అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మక్తల్ రూరల్, జూలై 25 : మక్తల్ మునిసిపాలిటీలో అధిక శ్రావణ మాసం సందర్భంగా ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో వాసవీ మాత ఆలయంలో మంగళవారం అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 108 మంది మహిళలు 108 రకాల పూలు, పండ్లు రవికలు, చీరలు, బాదం, కాజు, చెర్రీ పండ్లు మొదలైన వాటితో అమ్మవారికి అర్చన చేసి వాయినం సమర్పించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళ సభ జిల్లా అధ్యక్షురాలు కొత్త మీరా బాయి, కోశాధికారి అగ్లర్ రేఖ, ప్రసన్న, బోరిశెట్టి పద్మ, మనసాని సరళ, వడ్వాట్ సుజాత, విజయలక్ష్మి పాల్గొన్నారు.