అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి
ABN , First Publish Date - 2023-12-05T23:47:13+05:30 IST
క్రీడల్లో ప్రతిభను ప్రదర్శించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని, తమ గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని డీఈవో ఎండీ సిరాజుద్దీన్ క్రీడాకారులకు పిలుపునిచ్చారు.
- డీఈవో ఎండీ సిరాజుద్దీన్
- అట్టహాసంగా రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
గద్వాల అర్బన్, డిసెంబరు 5 : క్రీడల్లో ప్రతిభను ప్రదర్శించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని, తమ గ్రామానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని డీఈవో ఎండీ సిరాజుద్దీన్ క్రీడాకారులకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియం, సోమనాద్రి స్టేడియంలో 67వ ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం అండర్-17 రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. కార్యక్ర మానికి డీఈవో ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రీడా కారులు ఎంతోమంది ఉన్నారన్నారు. ఆరోగ్యవంత మైన జీవితం గడపాలంటే ప్రతీ విద్యార్థి క్రీడల్లో పాల్గొనాలన్నారు. క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి ఉన్నత విద్య, ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. అనంతరం గద్వాల సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ యువత, విద్యార్థులు చెడు వ్యవస నాలకు బానిసలు కాకుండా ఉండాలంటే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. సమాజంలో ఎలాంటి క్రీడా శక్తి లేని వారే చెడు వ్యవసనాలకు బానిసల వుతున్నారని, వారి జీవితాలను నాశనం చేసుకుంటు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని యువత సన్మార్గంలో నడిచి, కుటుం బానికి అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో డీవైఎస్ డాక్టర్ బీఎస్ ఆనంద్, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి పి.జితేందర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాసులు, పరిశీలకులు సుధాకర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రాఘవ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు కృష్ణ, నాగేష్, బీసన్న, నరసింహరాజు, రజనీకాంత్, బషీర్, జగదీష్, తిరుపతి, రాజేంద్ర పాల్గొన్నారు.
మొదటి రోజు పోటీల్లో..
రాష్ట్ర స్థాయి అండర్-17 బాలుర క్రికెట్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్‌లో భాగంగా మొదటి రోజు ఉదయం నిజామాబాద్ - అదిలాబాద్ జట్ల మధ్య పోటీ జరిగింది. అదిలాబాద్ జట్టు విజయం సాధించింది. రెండవ మ్యాచ్‌లో రంగారెడ్డి - కరీంనగర్ జట్ల మధ్య పోటీ జరుగగా కరీంనగర్ జట్లు గెలుపొందింది. నల్గొండ - ఖమ్మం జట్ల మధ్య జరిగిన మూడవ మ్యాచ్‌లో ఖమ్మం జట్టు విజయం సాధించింది. హైదరాబాద్ - వరంగల్ జట్ల మధ్య జరిగిన నాల్గవ మ్యాచ్‌లో వరంగల్ జట్టు గెలుపొందినట్లు కోచ్ శ్రీనివాసులు తెలిపారు.