ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి

ABN , First Publish Date - 2023-09-21T23:42:04+05:30 IST

జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్‌ చీర్ల శ్రీనివాస్‌ అన్నారు.

ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ చీర్ల శ్రీనివాస్‌, హాజరైన అధికారులు

- రెండు నియోజకవర్గాల్లో 593 పోలింగ్‌ కేంద్రాలు : అదనపు కలెక్టర్‌ చీర్ల శ్రీనివాస్‌

గద్వాల న్యూటౌన్‌, సెప్టెంబరు 21 : జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్‌ చీర్ల శ్రీనివాస్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాలులో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని రెండు నియోజక వర్గాల్లో 593 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సెక్టార్‌ జోనల్‌ అధికారులు తమ పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి చేపట్టాల్సిన పనులను గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాలని ఆదేశించారు. గద్వాల నియోజకవర్గంలో 303 పోలింగ్‌ స్టేషన్‌లకు 32 రూట్‌లు ఉన్న ట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడి పని చేయాలని హెచ్చరించారు. సమావేశంలో తహసీల్దార్లు, అధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు.

ఓటు హక్కు విశిష్టతను ప్రజలకు వివరించాలి

గద్వాల టౌన్‌ : ప్రజాస్వామ్యంలో ఓటుహక్కుకు ఉన్న విశిష్టతను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వివరిం చాలని అదనపు కలెక్టర్‌ చీర్ల శ్రీనివాస్‌ విద్యార్థులను కోరారు. ప్రజాప్రతినిధుల ఎన్నిక, ప్రభుత్వాల ఏర్పాటు లో ఓటుహక్కు విలువను వివరించడంతో పాటు ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగకుండా ఓటుహక్కును వినియోగించుకునేలా చైతన్యవంతులను చేయాలన్నారు. ఓటుహక్కుపై అవగాహనకు సంబంధించి స్వీప్‌ ఆధ్వ ర్యంలో పట్టణంలోని ఎంఏఎల్‌డీ కళాశాలలో గురు వారం వీధి నాటకాలు, వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో గట్టు టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ పాఠశాల ప్రథమ, టీఎస్‌ఆర్‌జేసీ బాలుర పాఠశాల ద్వితీయ, ధరూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు తృతీయ బహుమతులు సాధించారు. విజేతలకు వరుసగా రూ.10వేలు, రూ.8వేలు, రూ.5వేలు బహుమ తులను అందించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రమేష్‌బాబు, ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి హృదయ రాజు, బీసీ సంక్షేమశాఖ అధికారి శ్వేతా ప్రియ దర్శిని, ఉపాధి కల్పనశాఖ అధికారి ప్రియాంక, కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-21T23:42:04+05:30 IST