సర్పంచులు ఇదే స్ఫూర్తితో పనిచేయాలి

ABN , First Publish Date - 2023-03-25T23:27:15+05:30 IST

రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో పనిచేసి, గ్రామాన్ని ఉత్త మంగా నిలిపేందుకు కృషి చేయాలని జడ్పీ చైర్‌ పర్సన్‌ వనజ, ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి, కలెక్టర్‌ శ్రీహర్ష పేర్కొన్నారు.

సర్పంచులు ఇదే స్ఫూర్తితో పనిచేయాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి

- జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ, ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి, కలెక్టర్‌ శ్రీహర్ష

- ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన సర్పంచులకు అవార్డులు ప్రదానం

నారాయణపేట టౌన్‌, మార్చి 25 : రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో పనిచేసి, గ్రామాన్ని ఉత్త మంగా నిలిపేందుకు కృషి చేయాలని జడ్పీ చైర్‌ పర్సన్‌ వనజ, ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి, కలెక్టర్‌ శ్రీహర్ష పేర్కొన్నారు. నారాయణపేట స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌లో శనివారం జరిగిన జాతీయ పంచాయతీ అవార్డులు -22 ప్రదానోత్సవానికి వారు పా ల్గొని మాట్లాడారు. తొమ్మిది కేటగిరిల్లో ఉత్తమ గ్రా మ పంచాయతీలుగా ఎంపికైన సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి అ వార్డులు, మెమోంటోలను ప్రదానం చేసిన సన్మా నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో సమస్యలు ఉంటాయని వాటిని అధిగమించి వివిధ ధీమ్‌లలో గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన పంచాయతీ సిబ్బందిని అభినందించా రు. జాతీయ దీన్‌ దయాల్‌ గ్రామ పంచాయతీ అ వార్డులను కెటగిరిలుగా విభజించి ప్రతీ కెటగిరిలో ఉత్తమ ఫలితాలు సాధించిన మొదటి మూడు పం చాయతీలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కేటాయించి అవార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. మొత్తం 27 పంచాయతీలకు జాతీయ స్థాయి అవా ర్డులు దక్కాయని కలెక్టర్‌ పేర్కొన్నారు. పంచాయతీ ప్రతినిధులు, అధికారులు పనిచేస్తే ఈ జాతీయ అవార్డులు సాధించారని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ సారి అవార్డులు రానీవారు నిరాశ పడవద్దని, వచ్చే ఏడాది ఎక్కువ అవార్డులు సాధించాలన్నా రు. అంతకుముందు పేటకు చెందిన అజీమ్‌ ఉన్నిసా బేగంకు మూత్రపిండాల ఆపరేషన్‌ కోసం ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి ప్రభుత్వం ద్వారా మంజూరైన నూ.2 లక్షల ఎల్‌వోసీ పత్రాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సురేఖ, జడ్పీ సీఈవో జ్యోతి, అధికారులు గోపాల్‌, మురళి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:27:15+05:30 IST