పాలమూరులో సంబురాలు
ABN , First Publish Date - 2023-12-05T23:40:53+05:30 IST
పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయడం పై మంగళవారం రాత్రి ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.
- బాణసంచా కాల్చిన కాంగ్రెస్ నాయకులు
- జిల్లా అభివృద్ధికి దోహదం అవుతుందని అభిప్రాయం
- ఫుల్ జోష్‌లో కాంగ్రెస్ శ్రేణులు
మహబూబ్‌నగర్, డిసెంబరు 5 : పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయడం పై మంగళవారం రాత్రి ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. పట్ట ణంలోని మల్లికార్జున చౌరస్తాలో శ్రేణులు బాణసంచా కాల్చి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు ఎన్‌పీ వెంక టేశ్ మాట్లాడుతూ పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్‌రెడ్డి సీఎం అవుతున్న సందర్భంగా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్తలో ఆనందం వ్యక్తమవుతుందన్నారు. జిల్లార పజలందరికీ ఇది గర్వకారణమని చెప్పారు. ముఖ్యమంత్రి జిల్లా కావడంతో పాలమూరు అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంతో పాటు జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తారన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఆశీస్సులతో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్దఎత్తున అభివృద్ధి చేస్తారన్నారు. ఇదివరకు అభివృద్ధి అంటే షో చేశారని, ఇప్పుడు అసలైన అభివృద్ధి జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయబోతున్నందున ఆయనకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద్‌కుమార్‌గౌడ్, సీజే బెనహర్, సిరాజ్‌ఖాద్రి, లక్ష్మణ్‌యాదవ్, సాయిబాబ, రాములుయాదవ్ పాల్గొన్నారు